జనసేనకు ఫలితాలు రాకుండానే ప్యాకప్!
ఫలితాలు వచ్చే వరకూ కూడా జనాలు వేచి ఉండేలా లేరు! జనసేనకు కు ఆ పార్టీ నేతలు ప్యాకప్ చెబుతూ ఉన్నట్టుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే కొంతమంది జనసేన క్రియాశీల నేతలు రాజీనామాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వా ఇంకా ఫలితాలు రాకముందే మరిన్ని రాజీనామాలు మొదలయినట్టుగా ఉన్నాయి. తాజా వికెట్ అద్దేపల్లి శ్రీధర్ అని సమాచారం. మొన్నటి వరకూ టీవీ చానళ్లలో జనసేన తరఫున అద్దేపల్లి శ్రీధర్ గట్టిగా […]
ఫలితాలు వచ్చే వరకూ కూడా జనాలు వేచి ఉండేలా లేరు! జనసేనకు కు ఆ పార్టీ నేతలు ప్యాకప్ చెబుతూ ఉన్నట్టుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే కొంతమంది జనసేన క్రియాశీల నేతలు రాజీనామాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వా ఇంకా ఫలితాలు రాకముందే మరిన్ని రాజీనామాలు మొదలయినట్టుగా ఉన్నాయి.
తాజా వికెట్ అద్దేపల్లి శ్రీధర్ అని సమాచారం. మొన్నటి వరకూ టీవీ చానళ్లలో జనసేన తరఫున అద్దేపల్లి శ్రీధర్ గట్టిగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. పవన్ కల్యాణ్ తరఫున గట్టిగా మాట్లాడారు. ‘పాతికేళ్ల’ భవిష్యత్ అంటూ పవన్ కల్యాణ్ మాటలనే తిప్పి చెప్పారు అద్దేపల్లి.
అయితే ఏమైందో ఏమో కానీ తను జనసేన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టుగా అద్దేపల్లి ప్రకటించారు. ఇన్ని రోజులూ జనసేన పార్టీ కోసం పని చేయడంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.
తన బాధ్యతలను తను చక్కగా నిర్వర్తించినట్టుగా, ప్రస్తుతానికి తను జనసేన కార్యకలాపాలకు ఇక దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా.. సమాచారం ఇస్తూ అద్దే పల్లి శ్రీధర్ సెలవు ప్రకటించుకున్నారు! ఇంకా ఫలితాల రాకుండానే ప్యాకప్ లు అంటే.. ఫలితాలు వచ్చాకా పరిస్థితి ఏమిటో.. రాజీనామాలు ఇంకా ఎన్ని ఉండబోతున్నాయో!