Telugu Global
Cinema & Entertainment

సునీల్ ని కాపాడిన చిరంజీవి

వారింట్లో రోడ్ ప్రమాదాలు జరిగిన అప్పటి నుండి నందమూరి కుటుంబ సభ్యులు అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించమని చెప్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ప్రతి సినిమా కి ముందు జానాలని సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించమని విజ్ఞప్తి చేస్తూ ఉంటాడు. కానీ చాలా మందికి సీట్ బెల్ట్ ప్రాణం నిలుపుతుంది అనే విషయం అర్ధం కాదు. తాజాగా కమెడియన్ సునీల్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన చావు అంచుల వరకు వెళ్ళి […]

సునీల్ ని కాపాడిన చిరంజీవి
X

వారింట్లో రోడ్ ప్రమాదాలు జరిగిన అప్పటి నుండి నందమూరి కుటుంబ సభ్యులు అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించమని చెప్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ప్రతి సినిమా కి ముందు జానాలని సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించమని విజ్ఞప్తి చేస్తూ ఉంటాడు. కానీ చాలా మందికి సీట్ బెల్ట్ ప్రాణం నిలుపుతుంది అనే విషయం అర్ధం కాదు. తాజాగా కమెడియన్ సునీల్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన చావు అంచుల వరకు వెళ్ళి ఎలా తిరిగొచ్చాడు అనేది చెప్పారు. అంతే కాకుండా మెగా స్టార్ చిరంజీవి వలనే తన ప్రాణాలని కాపాడుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, “టాగోర్ షూటింగ్ సమయం లో ఒకసారి భీమవరం వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ లో మా హీరో అయిన అన్నయ్య చిరంజీవి గారికి విషయం చెపుదాం అని వెళ్లాను. ఆయన హాపీ జర్నీ అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయమని చెప్పారు. సాధారణం గా నాకు సీట్ బెల్ట్ పెట్టుకొనే అలవాటు లేదు. కానీ ఆ రోజు అన్నయ్య చెప్పడం తో పెట్టుకున్నాను. సరిగ్గా వెళ్లేప్పుడు పెద్ద ఆక్సిడెంట్ జరిగి కారు నాలుగు పల్టీలు కొట్టింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండడం వలన స్వల్ప గాయాల తో ఆ రోజు బయట పడ్డాను. ఆ రోజు అన్నయ్య చెప్పిన మాటలే నా ప్రాణాలు కాపాడాయి.” అని సునీల్ చెప్పారు.

First Published:  21 April 2019 7:17 AM IST
Next Story