రజనీకాంత్, కమల్.. ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు?
ఒకరోజు తేడాతో.. తమిళ స్టార్ హీరోలు ఒకే తరహా ప్రకటన చేశారు. తన దృష్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీదే అని ప్రకటించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పటికే తను రాజకీయాల్లోకి వచ్చినట్టని చాన్నాళ్ల కిందట ప్రకటించుకున్న రజనీకాంత్ ఈ సారి తమిళనాడులో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తనూ పోటీ చేయలేదు, తన పార్టీనీ పోటి చేయించలేదు. తన పార్టీ పోటీలో ఉండదని రజనీ కొన్నాళ్ల కిందట ప్రకటించాడు. ఇక కమల్ హాసన్ మాత్రం రాజకీయ […]
ఒకరోజు తేడాతో.. తమిళ స్టార్ హీరోలు ఒకే తరహా ప్రకటన చేశారు. తన దృష్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీదే అని ప్రకటించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పటికే తను రాజకీయాల్లోకి వచ్చినట్టని చాన్నాళ్ల కిందట ప్రకటించుకున్న రజనీకాంత్ ఈ సారి తమిళనాడులో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తనూ పోటీ చేయలేదు, తన పార్టీనీ పోటి చేయించలేదు.
తన పార్టీ పోటీలో ఉండదని రజనీ కొన్నాళ్ల కిందట ప్రకటించాడు. ఇక కమల్ హాసన్ మాత్రం రాజకీయ పార్టీని పోటీలో పెట్టాడు. మక్కల్ నీది మయ్యం అంటూ అన్ని లోక్ సభ సీట్లకూ తన అభ్యర్థులను పెట్టాడు. అయితే కమల్ పార్టీ ఈ ఎన్నికల్లో మరీ గొప్పగా సత్తా చాటేది ఏమీ లేదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
కమల్ మరీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాకపోవడం, ఆయనది అంతా క్లాస్ టచ్ కావడంతో పడే ఓట్లు కూడా తక్కువే అని అంటున్నారు. అందులోనూ ఎన్నికల ముందు మాత్రమే పార్టీని పెట్టాడు.
లోక్ సభ ఎన్నికల్లో సీట్లేమీ రాకపోయినా, పెద్దగా ఓట్ల శాతం పెద్దగా లేకపోయినా.. తను వెనక్కు తగ్గేది లేదని కమల్ ప్రకటించాడు. తన దృష్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీదే అని కమల్ ప్రకటించాడు.
మొత్తానికి ఇలా.. రజనీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరూ తమ తదుపరి టార్గెట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే అని ప్రకటించారు. తద్వారా తమిళనాడు సీఎం పీఠాన్ని వీరు టార్గెట్ చేసినట్టే.
ఇది వరకూ సినిమా వాళ్లు అధిష్టించిన నేఫథ్యం ఉంది తమిళనాడు సీఎం కుర్చీకి. ఆ కుర్చీలో ఈ ఇద్దరు హీరోల్లో ఎవరైనా కూర్చోగలుగుతారేమో చూడాలి!