బొబ్బిలి కోటలో ముదిరిన విభేదాలు.... సుజయకు తమ్ముడు గుడ్ బై !
విజయనగరం జిల్లా అంటేనే రాజుల రాజ్యం. ఓ వైపు అశోక్‌గజపతి రాజు…మరోవైపు సుజయ కృష్ణ రంగారావు. అయితే ఈ రాజుల ఇద్దరి పరిస్థితి ఇప్పుడు బాగాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సుజయ కృష్ణ కు తమ్ముడితో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అన్నతో తమ్ముడు బేబి నాయన రాజకీయంగా విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను లేకపోతే అన్నకు మంత్రి పదవి వచ్చేది కాదని బేబి నాయన అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల సమయంలో జరిగిన మాటల యుద్ధం కొట్టుకునేదాకా […]
విజయనగరం జిల్లా అంటేనే రాజుల రాజ్యం. ఓ వైపు అశోక్‌గజపతి రాజు…మరోవైపు సుజయ కృష్ణ రంగారావు. అయితే ఈ రాజుల ఇద్దరి పరిస్థితి ఇప్పుడు బాగాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా సుజయ కృష్ణ కు తమ్ముడితో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అన్నతో తమ్ముడు బేబి నాయన రాజకీయంగా విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను లేకపోతే అన్నకు మంత్రి పదవి వచ్చేది కాదని బేబి నాయన అంటున్నారు.
అంతేకాకుండా ఇటీవల ఎన్నికల సమయంలో జరిగిన మాటల యుద్ధం కొట్టుకునేదాకా వెళ్లినట్లు బొబ్బిలి కోటలో ప్రచారం జరుగుతోంది. దీంతో అన్నపై అలిగిన బేబి నాయన బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రి అయిన తర్వాత సుజయ కృష్ణ ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం తన ఆస్తులు కాపాడుకునేందుకు ఆయన ప్రాధాన్యమిచ్చారని విజయనగరం కోడై కూస్తోంది.
ఇటు అశోక్‌గజపతి రాజు బంగ్లాలో అన్నీ తానై నడిపించిన చంటిరాజుతో పాటు, పీఏ గోపిరాజును బంగ్లానుంచి అశోక్‌గజపతిరాజు బహిష్కరించారు. తిట్టిన తిట్టు తిట్టకుండా….వీరిద్దరిని బయటకు పంపించారని విజయనగరంలో టాక్.
మరోవైపు టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా రాజులకు దూరమవుతోంది. ఎన్నికల ఫలితాలు అంచనా వేసే పనిలో ఉన్న ఇక్కడి సెకండ్ గ్రేడ్ కేడర్….పదవులు ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమని వైసీపీకి ఇప్పటికే వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పెద్దలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల్లో ప్రజల స్పందన చూసిన తర్వాతే రాజుల్లో ఈ అసహనం పెరిగిపోయిందని విజయనగరం జనాలు అనుకుంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీరి పరిస్థితి ఎలా ఉంటుందోనని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.