Telugu Global
Cinema & Entertainment

మన్మధుడు 2 " కథ ఇదేనా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం మన్మధుడు కి రెండో భాగం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత రెండు వారాలుగా సినిమా షూట్ జరుగుతుంది. మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాక, వెంటనే రెండో షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పోర్చుగల్ లో ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మొదటి భాగానికి రెండో భాగానికి అసలు […]

మన్మధుడు 2  కథ ఇదేనా?
X

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం మన్మధుడు కి రెండో భాగం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత రెండు వారాలుగా సినిమా షూట్ జరుగుతుంది. మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాక, వెంటనే రెండో షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం పోర్చుగల్ లో ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మొదటి భాగానికి రెండో భాగానికి అసలు సంబంధం ఉండదు అని ఇప్పటికే చెప్పాడు. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా కథ ఇదే అంటూ చక్కర్లు కొడుతుంది. కొంత మంది అభిమానులు ఇదే మన్మధుడు 2 కథ అని తెగ షేర్స్ కూడా చేస్తున్నారు.

“ఈ రెండో భాగం లో నాగార్జున పాత్ర మొదటి భాగం స్వభావం కి అనుగుణం గానే ఉంటుంది. ఈ రెండో పార్ట్ లో నాగార్జున తన చెల్లి జీవితం కోసం తన స్వార్థాన్ని కూడా లెక్క చెయ్యడు. చిన్నప్పటి నుండి గారాబంగా పెంచి పెద్ద చేసి తన చెల్లి ని ఒక పెద్ద ఇంటికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకుంటాడు. ఆ దశ లో ఆ చెల్లి, మిగిలిన కుటుంబ సభ్యులు కలిసి నాగార్జున కి ఒక పెళ్ళి సంబంధం చూద్దాం అని అనుకుంటారట. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా లో చూడాలి….” ఇది చూస్తుంటే ఎందుకో చిరంజీవి హిట్లర్ సినిమా గుర్తొస్తుంది.

కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకా చాలా రోజులు ఆగాల్సిందే.

First Published:  20 April 2019 12:48 AM GMT
Next Story