జీవీఎల్ పై దాడి
బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఆ బూటు ఆయన భుజానికి దగ్గరగా వెళ్లింది. దీంతో షాక్ కు గురి అయ్యారు జీవీఎల్. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. బూటుతో దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్ కు చెందిన డాక్టర్ భార్గవ్ గా గుర్తించారు. తాను […]
బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఆ బూటు ఆయన భుజానికి దగ్గరగా వెళ్లింది. దీంతో షాక్ కు గురి అయ్యారు జీవీఎల్. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు.
బూటుతో దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్ కు చెందిన డాక్టర్ భార్గవ్ గా గుర్తించారు. తాను జర్నలిస్టునని చెప్పుకుని ఆ ప్రెస్ మీట్ కు వచ్చాడట. అయితే జర్నలిస్టులతో పాటు అనేక మంది బీజేపీ నాయకులు కూడా ఆ ప్రెస్ మీట్ కు రావడంతో ఇతను జర్నలిస్టు కాదని సాటి జర్నలిస్టులు గుర్తించలేక పోయారు.
జీవీఎల్ పై బూటుతో దాడి చేసిన తర్వాత…. బీజేపీకి, జీవీఎల్ నరసింహారావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు ఆయన.
జీవీఎల్ ను కొట్టటానికి కూడా ముందుకు దూసుకొచ్చాడు. సిబ్బంది ఆపకపోతే ఘోరం జరిగేది. ఎందుకు దాడి చేశాడు.. కారణాలు ఏంటీ అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. జీవీఎల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా.. అతనిపైకి బూటును విసిరాడు. బూటు విసిరిన వ్యక్తిని పట్టుకున్న అక్కడి వ్యక్తులు పోలీసులకు అప్పగించారు. అయితే జీవీఎల్ పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది కాంగ్రెస్ చేసిన పనిగా ఆరోపిస్తున్నారు.