Telugu Global
NEWS

మాటల్లో ముప్పయి వేలు.... రాతల్లో మూడు వందలా బాబూ?

పోలింగ్‌ ముందు రోజు…. అంటే ఏప్రిల్‌ 10 న చంద్రబాబు నేరుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది అఫీస్‌కు వెళ్ళి వీరంగం వేశాడు. తన ఆఫీసులో తన కిందివాళ్ళమీద ఆవేశపడ్డట్టుగా ద్వివేది మీద, కేంద్ర ఎన్నికల సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కొద్దిసేపు ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే చంద్రబాబు మెడకు చుట్టుకోనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు వ్యాఖ్యలపై సీరియస్‌ అయినట్టు సమాచారం. అందుకే రాష్ట్ర ఎన్నికల […]

మాటల్లో ముప్పయి వేలు.... రాతల్లో మూడు వందలా బాబూ?
X

పోలింగ్‌ ముందు రోజు…. అంటే ఏప్రిల్‌ 10 న చంద్రబాబు నేరుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది అఫీస్‌కు వెళ్ళి వీరంగం వేశాడు. తన ఆఫీసులో తన కిందివాళ్ళమీద ఆవేశపడ్డట్టుగా ద్వివేది మీద, కేంద్ర ఎన్నికల సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కొద్దిసేపు ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశాడు.

ఇప్పుడు ఆ వ్యాఖ్యలే చంద్రబాబు మెడకు చుట్టుకోనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు వ్యాఖ్యలపై సీరియస్‌ అయినట్టు సమాచారం. అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేదీని…. ఆ రోజు చంద్రబాబు మీ ఆఫీసుకు వచ్చి మిమ్మల్ని గురించి ఏం మాట్లాడాడు? మమ్మల్ని గురించి ఏం మాట్లాడాడు?…. వివరంగా అనువాదం చేసి పంపమని కేంద్ర ఎన్నికల సంఘం ద్వివేదీని ఆదేశించింది. దాంతోపాటు ఆ సంఘటన వీడియోను కూడా జతచేసి పంపమని కోరింది. ఈ విషయం తెలిసి రాష్ట్ర టీడీపీ నాయకులు కంగారుపడుతున్నట్లు సమాచారం.

ఎన్నికల సంఘం గురించి రోజుకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికే తాను నోరు జారానని తెలుసుకుని తన మాటలను సరిదిద్దుకుంటున్నాడు. 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదు…. అని మొదట్లో మాట్లాడిన బాబు ఆ తరువాత 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని ప్రజలు అనుకుంటున్నారని మాట మార్చాడు.

30 శాతం అంటే చంద్రబాబు లెక్క ప్రకారం సుమారు 30వేల ఈవీఎంలు పనిచేయలేదన్నమాట..! ఇదే చంద్రబాబు టీడీపీ నాయకులతో కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆఫీసుకు వెళ్లి సుమారు మూడు వందల ఈవీఎంలు సరిగా పనిచేయలేదని ఫిర్యాదు చేశాడు. అంటే మీడియా ముందు వీరంగాలు వేసిన 30 వేలు ఎక్కడా? కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆఫీసులో చెప్పిన 300 ఎక్కడ?

అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 300 ఈవీఎంలు పనిచేయలేదనేది తప్పని… కొందరు సిబ్బందికి వాటిని వాడడం చేతరాక కొంత ఇబ్బంది పడ్డారని కానీ ఆతరువాత సర్దుకుని ఆ ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించారని మొత్తం మీద పదో పదిహేనో ఈవీఎంలతో సమస్య ఏర్పడిందని కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ పంపించారని సమాచారం.

రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎన్నికల సంఘాన్ని బదనాం చేసిన చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  17 April 2019 1:40 PM IST
Next Story