అనంతలో ఊహించని ఫలితాలు?
అనంతపురం…టీడీపీ కంచుకోట. ఇందులో డౌటు లేదు. చాలాఏళ్లుగా ఈ జిల్లాలో టీడీపీ మెజార్టీ సీట్లు గెలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో 14 సీట్లలో 12 సీట్లు టీడీపీ గెలిచింది. కేవలం రెండు సీట్లు మాత్రమే వైసీపీ గెలిచింది. ఉరవకొండ, కదిరి సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. ఇక రెండు ఎంపీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఈ సారి పరిస్థితి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2014 ఫలితం రివర్స్ కాబోతుందని పరిశీలకుల అంచనా. జిల్లాలోని […]
అనంతపురం…టీడీపీ కంచుకోట. ఇందులో డౌటు లేదు. చాలాఏళ్లుగా ఈ జిల్లాలో టీడీపీ మెజార్టీ సీట్లు గెలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో 14 సీట్లలో 12 సీట్లు టీడీపీ గెలిచింది. కేవలం రెండు సీట్లు మాత్రమే వైసీపీ గెలిచింది. ఉరవకొండ, కదిరి సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. ఇక రెండు ఎంపీ సీట్లు కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.
అయితే ఈ సారి పరిస్థితి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2014 ఫలితం రివర్స్ కాబోతుందని పరిశీలకుల అంచనా.
జిల్లాలోని 14 సీట్లలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని గుంతకల్, శింగనమలలో కూడా వైసీపీ గెలుస్తోందని అంచనా వేస్తున్నారు.
రాయదుర్గంలో నాలుగు వేల తేడాతో వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి విజయం సాధిస్తారని తెలుస్తోంది. అనంతపురం అర్బన్‌లో కూడా 3 వేలకు పైగా మెజార్టీ వస్తుందని వైసీపీ నేతల లెక్క. ఇక తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం టైట్ ఫైట్ నెలకొంది. ఈ మూడు సీట్లలో ఒకటి వైసీపీ తప్పకుండా గెలుస్తుందని చెబుతున్నారు.
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తిలో వైసీపీ జెండా ఎగురవేస్తుందని అంటున్నారు. అయితే రాప్తాడు, పెనుకొండ, మడకశిరలో కూడా 3 నుంచి 4 వేలతో వైసీపీ గెలిచే చాన్స్‌లు ఉన్నాయనేది సర్వేలు చెబుతున్న విషయం.
ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ కు కూడా భారీ ఓట్ల ఆధిక్యం వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మొత్తానికి అనంతపురంలో వైసీపీ వేసిన లెక్కల ప్రకారం ఎనిమిది కంటే ఎక్కువ సీట్లు గెలిచినా అది చరిత్ర అవుతుంది. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేసినట్లు అవుతుంది.