Telugu Global
Cinema & Entertainment

ఆ సందర్భంలో సమంత.... చైతన్య పై అరిచేసిందట !

ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇండస్ట్రీకి చెందిన వారైతే వారి అభిరుచులపై కొందరు ఆసక్తి చూపుతూ ఉండడం సహజమే. ఇదే పరిస్థితి సమంత, నాగ చైతన్య ల కు కూడా ఏర్పడింది. పెళ్లయిన తర్వాత మొదటి సారిగా సామ్, నాగచైతన్య కలిసి ‘మజిలీ’ లో నటించిన సంగతి తెలిసిందే. శివ నిర్మాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సమంత…. […]

ఆ సందర్భంలో సమంత.... చైతన్య పై అరిచేసిందట !
X

ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇండస్ట్రీకి చెందిన వారైతే వారి అభిరుచులపై కొందరు ఆసక్తి చూపుతూ ఉండడం సహజమే. ఇదే పరిస్థితి సమంత, నాగ చైతన్య ల కు కూడా ఏర్పడింది. పెళ్లయిన తర్వాత మొదటి సారిగా సామ్, నాగచైతన్య కలిసి ‘మజిలీ’ లో నటించిన సంగతి తెలిసిందే. శివ నిర్మాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సమంత…. చైతన్య నటనపై కూడా దృష్టి పెట్టిందని…. కొన్నిసార్లయితే చైతన్య పై అరిచేసేదట.

ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. “షూటింగ్ జరుగుతున్నప్పుడు చైతన్య సీన్స్ ను నేను కూడా మానేటర్ ముందు కూర్చొని చూసే దాన్ని… ఒకవేళ తను సరిగ్గా చేయకపోతే కొన్నిసార్లు అరిచే దాన్ని కూడా. అలాగే ఒకవేళ తను చాలా బాగా నటిస్తే నేనే చాలా ఎగ్జైట్ అయ్యేదాన్ని…. నిజానికి ఈ సినిమా స్ట్రెస్ మొత్తం నేనే తీసుకున్నాను” అని చెప్పుకొచ్చింది సమంత. ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్య తెరపై కూడా భార్యాభర్తలుగా నటించిన సంగతి తెలిసిందే.

First Published:  17 April 2019 1:51 AM
Next Story