ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్
ఏడాది నిషేధం తర్వాత తిరిగి జట్టులో మాజీ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో…మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఏడాది విరామం తర్వాత తిరిగి చోటు సంపాదించారు. ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల కంగారూ జట్టును…క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక సంఘం అధికారికంగా […]
- ఏడాది నిషేధం తర్వాత తిరిగి జట్టులో మాజీ కెప్టెన్, వైస్ కెప్టెన్
- ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా 2019 వన్డే ప్రపంచకప్
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో…మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఏడాది విరామం తర్వాత తిరిగి చోటు సంపాదించారు.
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల కంగారూ జట్టును…క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక సంఘం అధికారికంగా ప్రకటించింది.
బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధం శిక్ష అనుభవించిన స్మిత్, వార్నర్ లను తిరిగి జట్టులోకి తీసుకొన్నట్లు…చీఫ్ సెలెక్టర్ ట్రెవర్ హాన్స్ ప్రకటించారు.
ఆస్ట్రేలియా జట్టులోని ఇతర ఆటగాళ్లలో ఉస్మాన్ క్వాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కుస్ స్టోయినస్, అలెక్స్ కోరీ, పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, రిచర్డ్ సన్, నేథన్ కోల్టర్ నైల్, జేసన్ బెహ్రెన్ డోర్ఫ్, నేథన్ లయన్, ఆడం జంపా ఉన్నారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా తన ప్రారంభమ్యాచ్ ను జూన్ 1న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది.