నారా, నందమూరి ఫ్యామిలీలో కొత్త చిచ్చు !
ఎన్నికలు ముగిశాయి. కానీ అవి రగిల్చిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఫలితాలకు 40 రోజుల టైము ఉంది. ఎవరో గెలుస్తారో లేదో తెలియదు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఈ ఎన్నికలు చిచ్చు పెట్టేలా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి చెందిన నందమూరి, నారా కుటుంబాల్లో ఇప్పటికే గ్యాప్ తీసుకొచ్చినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. విశాఖ టీడీపీ అభ్యర్థిగా భరత్‌ను చివరి నిమిషంలో ప్రకటించారు. ఆయన ముందు నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు, కానీ ఆ సీటు […]
ఎన్నికలు ముగిశాయి. కానీ అవి రగిల్చిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఫలితాలకు 40 రోజుల టైము ఉంది. ఎవరో గెలుస్తారో లేదో తెలియదు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఈ ఎన్నికలు చిచ్చు పెట్టేలా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి చెందిన నందమూరి, నారా కుటుంబాల్లో ఇప్పటికే గ్యాప్ తీసుకొచ్చినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
విశాఖ టీడీపీ అభ్యర్థిగా భరత్‌ను చివరి నిమిషంలో ప్రకటించారు. ఆయన ముందు నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు, కానీ ఆ సీటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా లీకులు ఇచ్చారు. అయితే పార్టీ కేడరే కాదు. సోషల్ మీడియా బాబు, జేడీ జోడిని ఆడుకుంది. దీంతో వెనక్కి తగ్గిన చంద్రబాబు జేడీకి బ్రాంచ్ ఆఫీసులో టికెట్ ఇప్పించారు. అయితే ఇక్కడితో కథ ఆగిపోలేదు.
టీడీపీ కేడర్ మొత్తం ఎంపీగా జేడీకి ఓటు వేసేటట్లు అమరావతి నుంచి మంత్రాంగం నడిపారు. చంద్రబాబుతో పాటు లోకేష్ టీడీపీ ముఖ్య నేతలకు ఫోన్ చేసి లక్ష్మీనారాయణకు ఓటు వేయాలని చెప్పారట. దీంతో టీడీపీ కేడర్ జనసేన గుర్తుపై ఓటు వేశారు. దీంతో శ్రీభరత్ పొజిషన్ ఇప్పుడు ఏంటి అనేది తెలియడం లేదు. మూడో ప్లేస్‌కు పడిపోతారా? లేక పెద్దమ్మ పురంధేశ్వరి కంటే ఓట్లు తక్కువగా వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మంత్రి గంటాతో పాటు అందరూ ఎమ్మెల్యేలు శ్రీభరత్‌ను వాడుకున్నారు. తీరా ఓట్లు దగ్గర కి వస్తే మాత్రం పక్కనపెట్టేశారని తెలుస్తోంది. ఈవిషయం గమనించిన శ్రీ భరత్ ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు తెలుస్తోంది. తోడల్లుడు లోకేష్ ఇంత మోసం చేస్తారని అనుకోలేదని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. ఈ విషయం ముందే తెలిసిన భరత్ భార్య తేజస్విని రాజకీయాల్లోకి వెళ్లొద్దని కోరారట.
మొత్తానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ పరంగా ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీకి కూడా భరత్ రాలేదని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు నందమూరి, నారా ఫ్యామిలీ మధ్య గ్యాప్ మాత్రం తీసుకొచ్చాయి. రానున్న రోజుల్లో ఈ గొడవలు ఎటు దారితీస్తాయో చూడాలి.