కోడెల మీద కేసు పెట్టండి....
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరుగుతున్న వరుస దాడులు, సంఘటనలపై వైఎస్ జగన్ పార్టీ సీనియర్లతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…. నిన్న మా ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల మీద గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత నుంచి టీడీపీ దాడులకు పాల్పడుతోందని అన్నారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను […]
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరుగుతున్న వరుస దాడులు, సంఘటనలపై వైఎస్ జగన్ పార్టీ సీనియర్లతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…. నిన్న మా ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల మీద గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత నుంచి టీడీపీ దాడులకు పాల్పడుతోందని అన్నారు.
చంద్రబాబు పోలీసు వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో గవర్నర్‌కు తెలియజేశామన్నారు. తన కులానికి చెందిన పోలీసు అధికారులకు బాబు అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చారన్నారు. వాళ్ళను ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లులాగా వాడుకున్నారన్నారు.
మా మీదే దాడి చేసి, మా పైనే అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.
ఇనుమెట్లలో కోడెల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకున్నారని… పోలింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నా కోడెల ఎలా తలుపులు వేస్తారని? అలా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్దం కాదా? అని ప్రశ్నించారు. ఇలా చేసిన కోడెల పై ఇప్పటి వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఓటర్లను కోడెల భయబ్రాంతులకు గురి చేశారన్నారు.
తనంతట తానే చొక్కాలు చింపుకుని, తనపై దాడి చేశారని కోడెల ప్రచారం చేసుకున్నారన్నారు.
అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పై దాడి చేసిన టీడీపీ నాయకులపై ఇప్పటివరకూ కేసు పెట్టలేదని మండిపడ్డారు. పూతలపట్టులో మా అభ్యర్ధి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలు దాడి చేసి తల పగలగొట్టారన్నారు. ఆయన ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని…. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసులు పెట్టలేదన్నారు.
గురజాలలో తమకు అనుకూలంగా లేరని ఎస్సీలు, ముస్లిం కాలనీలపై టీడీపీ నాయకులు దాడులు చేశారన్నారు. దాడి చేసినవారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా బాధితులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు జగన్.
చంద్రబాబు తన బినామీల బిల్లులు క్లియర్ చేసే పనిలో ఉన్నారని… సచివాలయాన్ని దుర్వినియోగం చేయకుండా చంద్రబాబును నియంత్రించాలని కూడా గవర్నర్‌ను కోరారు జగన్.
- andhra nayeemcase filedcase filed on kodelafactionist kodelafactionist kodela siva prasada raoGunturguntur factionguntur nayeemguntur politicskidnap kidnapkodelakodela ambatikodela kidnapsKodela Siva Prasad RaoKodela Siva Prasada Raokodela siva prasada rao ambati rambabukodela siva prasada rao factionkodela siva rama krishnakodela siva rama krishna kidnapkodela siva rama krishna kidnap casekodela vijayalakshminava nirmana deeksha 2018Nayeemnayeem kodela siva prasada raonayeem kodela siva rama krishnaPolitical newspolitical telugu newssattenapalli factionsattenapalli mlasattenapalli mla kodela siva prasada raosattenapalli nayeemsattenapalli politicsspeaker kodelaSpeaker Kodela Siva Prasada RaoTelugu News