Telugu Global
NEWS

ఈవీఎంలు మారలేదు.... ప్రజల తీర్పే మారింది

ఇదే ఈవీఎంలతో 2014లో గెలిచావు… మొన్న నంద్యాల ఉప ఎన్నికలో గెలిచావు… ఈవీఎంలపై అప్పుడేం మాట్లాడలేదు… కొద్ది నెలల క్రితం నాలుగు రాష్ట్రాల్లో ఇదే ఈవీఎంలతో కాంగ్రెస్‌ గెలిచింది… అప్పుడు ఏం మాట్లాడలేదు…. ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి ఆ నెపాన్ని ఈవీఎం లపై నెట్టాలని చూస్తున్నావు…. అన్నాడు జగన్‌ గవర్నర్‌ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి. ఓటేసిన 80శాతం మందిలో ఓటర్లకు తాము ఏ గుర్తుకు ఓటేశామో వీవీ ప్యాట్‌లో కనిపించిందని, ఏ […]

ఈవీఎంలు మారలేదు.... ప్రజల తీర్పే మారింది
X

ఇదే ఈవీఎంలతో 2014లో గెలిచావు… మొన్న నంద్యాల ఉప ఎన్నికలో గెలిచావు… ఈవీఎంలపై అప్పుడేం మాట్లాడలేదు… కొద్ది నెలల క్రితం నాలుగు రాష్ట్రాల్లో ఇదే ఈవీఎంలతో కాంగ్రెస్‌ గెలిచింది… అప్పుడు ఏం మాట్లాడలేదు…. ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి ఆ నెపాన్ని ఈవీఎం లపై నెట్టాలని చూస్తున్నావు…. అన్నాడు జగన్‌ గవర్నర్‌ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి.

ఓటేసిన 80శాతం మందిలో ఓటర్లకు తాము ఏ గుర్తుకు ఓటేశామో వీవీ ప్యాట్‌లో కనిపించిందని, ఏ ఒక్కరూ దీని పై ఫిర్యాదు చేయలేదని…. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు మాత్రం తన ఓటు తనకు పడిందో లేదో తెలియదని అనడం దుర్మార్గం అని, ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు జగన్‌.

పోలింగ్‌కు ముందు ఈవీఎంలను అన్ని పార్టీల ఏజెంట్లు చెక్‌ చేశారని, టీడీపీతో పాటు అన్ని పార్టీల ఏజెంట్లు ఈవీఎంలను చెక్‌ చేశారని చంద్రబాబుకు అది తెలియదా? అని ప్రశ్నించారు. బాబు సర్కారు పెట్టిన అధికారులే ఎన్నికల సిబ్బంది కాదా? అని గుర్తుచేశారు.

మూడునెలల ముందు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌ లలో ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయని అప్పుడు కాంగ్రెస్‌ పార్టీనే గెలిచిందని గుర్తుచేశారు. తాను గెలిస్తే ఒక తీరుగా… ఓడిపోతున్నామని తెలిసి మరో తీరుగా మాట్లాడం చంద్రబాబుకు అలవాటు అన్నారు.

ఇదే చంద్రబాబు 2014లో ఈవీఎంలతోనే గెలిచారని, అప్పుడు వీవీ ప్యాట్‌లు కూడా లేవని గుర్తుచేశారు.

మచిలీ పట్నంలో అభ్యర్థులు లేకుండా స్ట్రాంగ్‌ రూం ఎలా తెరుస్తారని మండిపడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవాలంటే అభ్యర్థులందరినీ పిలవాలని… కానీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కూడా నచ్చిన అధికారులను పెట్టుకున్న చంద్రబాబు… స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిపించి ఈవీఎంలను ఎలా బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలోని స్ట్రాంగ్‌ రూముల బాధ్యతను కేంద్రానికి అప్పగించాలని కోరారు. స్ట్రాంగ్‌ రూంలను పూర్తిగా సిసి సర్వలెన్స్‌లో ఉంచాలన్నారు.

First Published:  16 April 2019 7:38 AM IST
Next Story