Telugu Global
NEWS

గాల్లో దీపంలా మారిన అంబటి రాయుడి బెర్త్

ప్రపంచకప్ కు విరాట్ సేన ఎంపిక నేడే మరికాసేపట్లో 15 మంది సభ్యుల భారతజట్టు రెండోడౌన్ స్థానం రాయుడు, విజయ్ శంకర్ పోటీ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును మరి కాసేపట్లో బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది.  కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీతో సహా మొదటి 14 మంది ఆటగాళ్ల స్థానాలు […]

గాల్లో దీపంలా మారిన అంబటి రాయుడి బెర్త్
X
  • ప్రపంచకప్ కు విరాట్ సేన ఎంపిక నేడే
  • మరికాసేపట్లో 15 మంది సభ్యుల భారతజట్టు
  • రెండోడౌన్ స్థానం రాయుడు, విజయ్ శంకర్ పోటీ

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును మరి కాసేపట్లో బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీతో సహా మొదటి 14 మంది ఆటగాళ్ల స్థానాలు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. అయితే…టీమిండియా టాపార్డర్ కే కీలకంగా మారిన రెండోడౌన్ స్థానం ఎంపికే ఇప్పుడు కీలకంగా మారింది.

నాలుగోనంబర్ స్థానం కోసం…అంబటి రాయుడు, ఆల్ రౌండర్ విజయ్ శంకర్, యువఓపెనర్ కెఎల్ రాహుల్ ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది.

2017 నుంచి 11 మంది పోటీ

టీమిండియా నంబర్ ఫోర్ స్థానం కోసం…2017 సీజన్ నుంచి కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా మొత్తం 11 మంది వేర్వేరు ఆటగాళ్లను పరీక్షించారు. వీరిలో..అంబటి రాయడు, యువరాజ్ సింగ్, ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అజింక్యా రహానే, ధోనీ, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, రిషభ్ పంత్ ఉన్నారు.

గత ఏడాదికాలంగా అంబటి రాయుడు మాత్రమే రెండోడౌన్ స్థానంలో 15 మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ , రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 464 పరుగులతో సహా 85.60 సగటు సాధించాడు.

అయితే…ఆస్ట్రేలియాతో సిరీస్ లో అంతంత మాత్రంగా రాణించడంతో పాటు…ప్రస్తుత ఐపీఎల్ లో సైతం రాయుడి తడబాటు…. మిగిలిన ఆటగాళ్ల పాలిట వరంగా మారింది.

ఇదే అదనుగా తీసుకొని…రాయుడు స్థానానికే ఎసరు పెట్టాలని పలువురు చూస్తున్నారు. మరోవైపు…నంబర్ ఫోర్ స్థానంలో రాయుడే అత్యుత్తమమని పలువురు మాజీ సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.

జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ పోటీపడుతున్నారు. నాలుగో పేసర్ ఎంపిక కూడా సెలెక్టర్లకు పెద్దపరీక్షే కానుంది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో..రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్,కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ సభ్యులుగా ఉండే అవకాశం ఉందని…క్రికెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

First Published:  16 April 2019 2:54 AM IST
Next Story