పవన్ ముందు రెండే దారులు?
అయితే జగన్.. కాకుంటే చంద్రబాబు.. ఈ ఇద్దరిలో ఒకరి గెలుపు ఖాయమని ఏపీ ప్రజానీకం, రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ ఆటలో అరటిపండులా మధ్యలో వచ్చిన జనసేనాని పవన్ కళ్యాన్ పొజిషన్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇద్దరూ…. బాబు, జగన్ లు రాజకీయాల్లోనే ఉంటారు. కానీ సినిమాలు వదిలీ.. టాలీవుడ్ కాడి వదిలేసి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుందామని వచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. […]
అయితే జగన్.. కాకుంటే చంద్రబాబు.. ఈ ఇద్దరిలో ఒకరి గెలుపు ఖాయమని ఏపీ ప్రజానీకం, రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ ఆటలో అరటిపండులా మధ్యలో వచ్చిన జనసేనాని పవన్ కళ్యాన్ పొజిషన్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.
అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇద్దరూ…. బాబు, జగన్ లు రాజకీయాల్లోనే ఉంటారు. కానీ సినిమాలు వదిలీ.. టాలీవుడ్ కాడి వదిలేసి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుందామని వచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది.
పవన్ కళ్యాన్ పోటీచేసిన గాజువాకలో, భీమవరంలో గెలుస్తాడో లేదో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో సినీ గ్లామర్ రాజకీయాల్లో పనిచేసిందో లేదో తెలియాలంటే మే 23వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పటికే జనసేనాని పవన్ కు అర్థమైపోయింది. ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే చర్చ సాగుతోంది.
పవన్ మళ్లీ తన మిత్రుడు త్రివిక్రమ్ ఆసరాతో సినిమాల్లోకి మళ్లీ రిటర్న్ వెళ్లిపోతాడా? అని పవన్ శిభిరంలో సమాలోచనలు సాగుతున్నాయట. పవన్ కు రాజకీయాలకంటే సినిమాలే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈవీఎంలపై నెపం నెట్టి తప్పించుకోవచ్చు కానీ.. పవన్ కు ఆప్షన్ లేదు.. జనాలు తీర్పునిచ్చారు. కానీ పవన్ అదృష్టం బాగోలేక సీట్లు రాకపోతే ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.