కొత్త మలుపు తిరిగిన సంగీత కుటుంబ వివాదం
నటి సంగీత కుటుంబంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె తల్లి భానుమతి, చెన్నైలోని మహిళా హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సంగీత తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన ఆస్తి లాక్కుందని భానుమతి ఆరోపించింది. ఇది జరిగి 3 రోజులవుతుంది. ఈ 3 రోజుల్లో సంగీత, సోషల్ మీడియాలో బలిపశువు అయింది. అలా సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో ఇబ్బందిపడిన సంగీత, ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. తన చిన్నప్పట్నుంచి కన్నతల్లి భానుమతి పెట్టిన […]

నటి సంగీత కుటుంబంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె తల్లి భానుమతి, చెన్నైలోని మహిళా హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సంగీత తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన ఆస్తి లాక్కుందని భానుమతి ఆరోపించింది. ఇది జరిగి 3 రోజులవుతుంది. ఈ 3 రోజుల్లో సంగీత, సోషల్ మీడియాలో బలిపశువు అయింది.
అలా సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో ఇబ్బందిపడిన సంగీత, ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. తన చిన్నప్పట్నుంచి కన్నతల్లి భానుమతి పెట్టిన చిత్రహింసల్ని ఏకరువు పెట్టింది. 13 ఏళ్ల వయసుకే సంగీతకు చదువు మాన్పించేసిందట భానుమతి. ఆమెను ఇండస్ట్రీలో పెట్టిందట. అక్కడ అష్టకష్టాలు పడిన సంగీత, ఎలాగోలా కష్టపడి హీరోయిన్ అయిందట.
హీరోయిన్ అయిన తర్వాత కూడా భానుమతి వేధింపులు ఆపలేదట. ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టించుకునేదట. ఇంట్లో ఓ ఇరుకైన గదిలో బంధించేదట. దీనికి తోడు సంగీత సోదరులు తాగుబోతులు. వాళ్లు కూడా సంగీతను వేధించేవారంట. ఈ విషయాలన్నింటినీ ట్విట్టర్ లో పెట్టేసింది సంగీత.
ఇలా తనను చిత్రహింసలకు గురిచేసిన తన తల్లి, ఇప్పుడు రివర్స్ లో తనపై ఫిర్యాదు చేస్తోందని.. ఆమె ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తను రాటుదేలుతానని, ధైర్యవంతురాలిగా నిలబడతానని తెలిపింది సంగీత. ప్రస్తుతం ఈమె తెలుగులో కొన్ని టీవీ కార్యక్రమాలు చేస్తోంది
To all my well wishers.. Thank u for always being there for me . And to all film lovers , IT IS NOT EASY TO BE AN ACTOR. pic.twitter.com/RuEjkTHpZT
— sangithakrish (@sangithakrish) April 12, 2019