Telugu Global
NEWS

ఇది నారా రాజ్యాంగం కాదు... భారత రాజ్యాంగం

ఈసీపై అసలు చంద్రబాబుకు గౌరవం ఉందా? అని ప్రశ్నించారు వైసీపీ నేత సి. రామచంద్రయ్య. సాక్ష్యాత్తూ చంద్రబాబు ఈసీ అధికారినే బెదిరించారని…. ఇది నారా రాజ్యాంగం కాదని… భారత రాజ్యాంగమని…. చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ లో నిన్న జరిగిన ఎన్నికల ఓటింగ్‌ సరళిని చూస్తే ప్రజాస్వామ్యం విజయం సాధించబోతోందన్నారు ఆయన. ప్రభుత్వ వ్యతిరేకతతోనే పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. లోకేష్‌ సహా కేబినెట్‌ మంత్రులు కూడా ఓటమి చవిచూడబోతున్నారని…. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా […]

ఇది నారా రాజ్యాంగం కాదు... భారత రాజ్యాంగం
X

ఈసీపై అసలు చంద్రబాబుకు గౌరవం ఉందా? అని ప్రశ్నించారు వైసీపీ నేత సి. రామచంద్రయ్య. సాక్ష్యాత్తూ చంద్రబాబు ఈసీ అధికారినే బెదిరించారని…. ఇది నారా రాజ్యాంగం కాదని… భారత రాజ్యాంగమని…. చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో నిన్న జరిగిన ఎన్నికల ఓటింగ్‌ సరళిని చూస్తే ప్రజాస్వామ్యం విజయం సాధించబోతోందన్నారు ఆయన. ప్రభుత్వ వ్యతిరేకతతోనే పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు.

లోకేష్‌ సహా కేబినెట్‌ మంత్రులు కూడా ఓటమి చవిచూడబోతున్నారని…. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని హితపు పలికారు. ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారని, అందుకే ఈవీఎంలు పనిచేయడం లేదంటూ బాగా ప్రచారం చేశారని అయినా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎల్లో మీడియాతో కాదు… నేషనల్‌ మీడియాతో ప్రెస్‌మీట్‌ పెట్టాలని సూచించారు.

సీఈసీ నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు పాటించాల్సిందేనన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంటున్నారని…. అయితే అలాంటి బుద్ధులు చంద్రబాబుకే ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు.

చీఫ్‌ సెక్రటరీ డీజీపీ కార్యాలయాన్ని సందర్శిస్తే గగ్గోలు ఎందుకు? అని, ఎన్నికల విధులు ఎలా జరిగాయో డీజీపీని చీఫ్ సెక్రటరీ అడగకూడదా? అని ప్రశ్నించారు. పోలింగ్‌కు ముందు రోజు పుసుపు-కుంకుమ పేరుతో డబ్బులు వేశారని…. దానిపై వైఎస్‌ జగన్‌ ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను మాత్రమే జగన్‌ ప్రజల్లోకి తీసుకెళ్ళారన్నారు.

ఢిల్లీలో అన్నాహజారే ధర్నాకు…. హాజరు కావాలని అవినీతిపరుడైన బాబు ప్రయత్నించాడని అయితే ఆయన దగ్గరకు కూడా రానివ్వలేదన్నారు.

కౌంటింగ్‌ వరకు బాబును ఊహాలోకంలో బతకనివ్వండి అని సి. రామచంద్రయ్య వ్యంగ్యంగా అన్నారు.

First Published:  13 April 2019 11:52 AM IST
Next Story