Telugu Global
NEWS

ఆ ఊరికే వెళ్ళలేదు.... నాపై కేసేంటి?

కోడెలపై దాడి కేసు పేరుతో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అంబటి, రాజనారాయణ, లింగారెడ్డి తదితరులపై మొత్తం 11 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కోడెల క్రిమినల్‌ స్వభావం కలిగిన వ్యక్తన్నారు. తాను గెలవడం కోసం ఎంతకైనా బరితెగించే చరిత్ర కోడెలదన్నారు. కోడెల తాను ఓడిపోతానన్న భయంతో ఇనిమెట్లలో […]

ఆ ఊరికే వెళ్ళలేదు.... నాపై కేసేంటి?
X

కోడెలపై దాడి కేసు పేరుతో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అంబటి, రాజనారాయణ, లింగారెడ్డి తదితరులపై మొత్తం 11 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కోడెల క్రిమినల్‌ స్వభావం కలిగిన వ్యక్తన్నారు. తాను గెలవడం కోసం ఎంతకైనా బరితెగించే చరిత్ర కోడెలదన్నారు. కోడెల తాను ఓడిపోతానన్న భయంతో ఇనిమెట్లలో గందరగోళం సృష్టించారన్నారు. ఓటర్లను బెదిరించడం, బూత్‌లను క్యాప్చర్‌ చేయడం కోడెల చరిత్ర అని చెప్పారు.

ఇనిమెట్ల గ్రామంలో గొడవకు కారణం కోడెలేనని, ఆయన రిగ్గింగ్‌కు పాల్పడడం వల్లనే గొడవ జరిగిందన్నారు. ఇనిమెట్ల గ్రామస్తుల్ని పోలీసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు అంబటి. మేం ఇనిమెట్ల గ్రామం వెళ్ళకపోయినా, ఆ గ్రామంలో కోడెల పై మేము దాడి చేసినట్లు మా పై కేసులు ఎలా పెడుతారని మండిపడ్డారు అంబటి.

నరసరావు పేట రౌడీలతో కోడెల ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌కి ఎందుకొచ్చారు? అని ప్రశ్నించారు. కోడెల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని, అదే ఇనిమెట్ల గ్రామం వెళ్ళకపోయినా మా పై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.

First Published:  13 April 2019 11:22 AM IST
Next Story