మీడియాకు ముఖం చాటేసిన చంద్రబాబు.. కారణం ఏంటి..?
చంద్రబాబుకు, మీడియాకు విడదీయరాని బంధం అని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయానికి మీడియా ముందుకు రావడం.. ప్రెస్‌మీట్లు పెట్టడం ఆయనకు పరిపాటి. ఎన్నడూ పబ్లిసిటీని, ప్రజల అటెన్షన్‌ను ఆయన కోరుకుంటుంటారు. అలాంటిది నిన్న ఉదయం నుంచి చంద్రబాబు మీడియా ముందుకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రోజు కూడా సీఈవో గోపాలకృష్ణను కలసి పిర్యాదు చేసిన చంద్రబాబు.. ఆ కార్యాలయం ముందు ఆందోళనకు కూడా దిగారు. […]
చంద్రబాబుకు, మీడియాకు విడదీయరాని బంధం అని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయానికి మీడియా ముందుకు రావడం.. ప్రెస్‌మీట్లు పెట్టడం ఆయనకు పరిపాటి. ఎన్నడూ పబ్లిసిటీని, ప్రజల అటెన్షన్‌ను ఆయన కోరుకుంటుంటారు. అలాంటిది నిన్న ఉదయం నుంచి చంద్రబాబు మీడియా ముందుకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రోజు కూడా సీఈవో గోపాలకృష్ణను కలసి పిర్యాదు చేసిన చంద్రబాబు.. ఆ కార్యాలయం ముందు ఆందోళనకు కూడా దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆయన యధేచ్చగా మీడియాను ఉపయోగించుకున్నారు.
అంతే కాకుండా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యాక ఈవీఎంలు పని చేయట్లేదంటూ మీడియాకు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. 11 గంటల తర్వాత ఇక బయట కనిపించలేదు. అప్పటి వరకు ఈసీకి లేఖ, రీపోలింగ్ అంటూ హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయిపోయారు. పోలింగ్ 6 గంటలకు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ మీడియా ముందుకు వచ్చి అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కాని చంద్రబాబు వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.
గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని విజయవాడ విలేకరులకు తెలియజేశారు. కాని ఆ తర్వాత వెంటనే రద్దైనట్లు సమాచారం పంపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునే ఆయన సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం వరకు గుర్తు రాని ఎన్నికల కోడ్ సాయంత్రానికి ఎలా గుర్తొచ్చిందని..? ఈ విషయాలన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు చంద్రబాబులో ఓటమి భయం పట్టుకుందని, అందుకే మీడియా ముందుకు రాలేదని అంటున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా చంద్రబాబు వైఖరి చూసి ఓటమి తప్పదా అని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని అనుమానం ఉండే చంద్రబాబు బయటకు రాలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే మొఖం చాటేశారని గుసగుసలాడుకుంటున్నారు.