ఆ సినిమా కూడా ఆగిపోయింది
నాగశౌర్యకు కాలం కలిసిరావడం లేదు. మొన్నటికిమొన్న భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజు కొలుసు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ఆపేశాడు ఈ హీరో. నిర్మాతతో ఇగో సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు నాగశౌర్యకు సంబంధించి మరో సినిమా కూడా ఆగిపోయింది. సుకుమార్ వద్ద రంగస్థలం సినిమాకి పనిచేసిన కాశీ విశాల్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు నాగశౌర్య. సుకుమార్ నిర్మాతగా ఈ సినిమా రావాల్సి ఉంది. స్టోరీ డిస్కషన్లు కూడా […]

నాగశౌర్యకు కాలం కలిసిరావడం లేదు. మొన్నటికిమొన్న భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజు కొలుసు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ఆపేశాడు ఈ హీరో. నిర్మాతతో ఇగో సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు నాగశౌర్యకు సంబంధించి మరో సినిమా కూడా ఆగిపోయింది.
సుకుమార్ వద్ద రంగస్థలం సినిమాకి పనిచేసిన కాశీ విశాల్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు నాగశౌర్య. సుకుమార్ నిర్మాతగా ఈ సినిమా రావాల్సి ఉంది. స్టోరీ డిస్కషన్లు కూడా పూర్తయ్యాయి. సినిమాను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. రేపోమాపో సెట్స్ పైకి వస్తుందనుకున్న ఈ సినిమా ఆగిపోయింది. నాగశౌర్య చెప్పిన కొన్ని మార్పులకు సుకుమార్ ఒప్పుకోలేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి అతడు తప్పుకున్నాడని టాక్.
ప్రస్తుతానికి నాగశౌర్య చేతిలో అవసరాల శ్రీనివాస్ సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా కూడా చర్చల దశలోనే ఉంది. అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు కానీ సెట్స్ పైకి రాలేదు. మరోవైపు సమంత నటిస్తున్న హే బేబీ అనే సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నాడు నాగశౌర్య.