ఎన్నికల అధికారుల తీరు పట్ల ఆర్కే అసంతృప్తి.... ఓటర్లతో కలిసి నిరసన
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై మూడు గంటలకు పైగా సమయం అయ్యింది. అయినా ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లు ఎండలో నిడబడలేక వెనుదిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 60 చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదు. ఈ విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారి వద్ద […]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై మూడు గంటలకు పైగా సమయం అయ్యింది. అయినా ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లు ఎండలో నిడబడలేక వెనుదిరుగుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 60 చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదు. ఈ విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారి వద్ద నుంచి సరైన సమధానం రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓటర్లు వెనుదిరుగుతున్నారని ఆర్కే వాపోయారు. దీంతో అధికారుల తీరుపట్ల ఆయన ఓటర్లతో కలిసి నిరసనకు దిగారు. కేవలం వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఈవీఎంలు ఎందుకు మొరాయిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పని చేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందని ఆయన అన్నారు.
మరోవైపు, ఎండలకు తట్టుకోలేక ఉదయాన్నే ఓటేద్దామని వస్తే గంటల తరబడి క్యూలో నిలబెట్టారని.. ఎన్నికల ఏర్పాట్లు చేయడం ఇలాగేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఆర్కేతో పాటు వారు కూడా నిరసనను దిగారు.