ఈవీఎంలు పని చేస్తున్నాయి.. పుకార్లు నమ్మొద్దు : ద్వివేది
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. 30 శాతం ఈవీఎలు పని చేయడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి 344 ఈవీఎంలు మొరాయించాయి.. కాని వెంటనే 319 ఈవీఎంలను పునరుద్దరించామని అన్నారు. మిగిలిన ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు […]
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. 30 శాతం ఈవీఎలు పని చేయడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అలాంటి పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి 344 ఈవీఎంలు మొరాయించాయి.. కాని వెంటనే 319 ఈవీఎంలను పునరుద్దరించామని అన్నారు. మిగిలిన ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామని ద్వివేది చెప్పారు. టెక్నీషియన్లు, ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు.
ఇక గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎంను పగులకొట్టిన ఘటన తమ దృష్టికి వచ్చిందని.. ఇప్పటికే ఆయనను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని.. విచారించి తర్వాత చర్యలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.