Telugu Global
NEWS

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం.... అందుకే బస్సుల తగ్గింపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) పేరుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా అది చేసేది పక్కా వ్యాపారమే. ప్రయాణికులకు సేవలందిస్తూనే లాభాలను అర్జించాలనేదే దాని వ్యూహం. హైదరాబాద్ కేంద్రంగా ప్రతీ రోజు వందలాది బస్సులు స్వరాష్ట్రంలోనే కాక పక్కనున్న ఏపీకి కూడా ప్రయాణిస్తూ వేలాది మందిని వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. ఇక సంక్రాంతి, దసరా వంటి పంగడ రోజుల్లో అయితే ప్రత్యేక బస్సులు వేసి టికెట్ ధరలు పెంచి లాభాలు పిండుకుంటుంటారు. ఆ […]

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం.... అందుకే బస్సుల తగ్గింపు
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) పేరుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా అది చేసేది పక్కా వ్యాపారమే. ప్రయాణికులకు సేవలందిస్తూనే లాభాలను అర్జించాలనేదే దాని వ్యూహం. హైదరాబాద్ కేంద్రంగా ప్రతీ రోజు వందలాది బస్సులు స్వరాష్ట్రంలోనే కాక పక్కనున్న ఏపీకి కూడా ప్రయాణిస్తూ వేలాది మందిని వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది.

ఇక సంక్రాంతి, దసరా వంటి పంగడ రోజుల్లో అయితే ప్రత్యేక బస్సులు వేసి టికెట్ ధరలు పెంచి లాభాలు పిండుకుంటుంటారు. ఆ రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ కూడా వందల సంఖ్యలో బస్సులను ఏపీలోని పలు ప్రాంతాలకు పంపుతుంటారు.

ఇక రేపు ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏపీకి చెందిన ఓటర్లు ఉన్నారు. దాదాపు 10 లక్షల మందికిపైగా తెలంగాణ నుంచి ఓటు వేయడానికి తరలివెళ్తారని తెలుస్తోంది.

వీరి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచే దాదాపు 250 బస్సులను నడిపిస్తోంది. అయితే అనూహ్యంగా తెలంగాణ ఆర్టీసీ మాత్రం కేవలం 30 బస్సులు మాత్రమే వేసింది. దీనికి కారణాలను ఆర్టీసీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా టీఎస్ఆర్టీసీపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత సర్వీసు క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రధాన పత్రికలో కూడా వార్తలు వచ్చాయని.. అంతే కాకుండా ఏపీలో ఒక భావోద్వేగం నడుస్తోంది. ఈ సమయంలో అక్కడికి బస్సులు వేసి ఏదైనా నష్టం జరిగితే సంస్థ భరించే స్థితిలో లేదన్నారు. అందుకే రెగ్యులర్‌గా నడిచే సర్వీసులకు అదనంగా కేవలం 30 బస్సులు మాత్రమే వేశామని అన్నారు. అయినా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులోనే ఉండటం వల్ల అసౌకర్యం కలగదని ఆయన చెప్పారు.

First Published:  10 April 2019 12:01 AM GMT
Next Story