మహర్షి మీద క్లారిటీ వచ్చేసింది
మహర్షి ఓవర్సీస్ రైట్స్ మీద వారం రోజులుగా పంచాయితీ నడిచిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ అయితే ఫిక్స్ అయింది కానీ, ఓవర్సీస్ మొత్తం తీసుకోమని వాళ్లు మొండికేశారు. దీనికి కారణం హిట్ అయినా మహేష్ బాబు సినిమాలతో వాళ్లకు ఏమీ మిగలట్లేదు. ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది. ఏం చెప్పి ఒప్పించారో తెలీదు కానీ, మహర్షి సినిమా ఓవర్సీస్ రైట్స్ ను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. కేవలం యూఎస్ లోనే కాకుండా.. […]
మహర్షి ఓవర్సీస్ రైట్స్ మీద వారం రోజులుగా పంచాయితీ నడిచిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ అయితే ఫిక్స్ అయింది కానీ, ఓవర్సీస్ మొత్తం తీసుకోమని వాళ్లు మొండికేశారు. దీనికి కారణం హిట్ అయినా మహేష్ బాబు సినిమాలతో వాళ్లకు ఏమీ మిగలట్లేదు. ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది.
ఏం చెప్పి ఒప్పించారో తెలీదు కానీ, మహర్షి సినిమా ఓవర్సీస్ రైట్స్ ను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. కేవలం యూఎస్ లోనే కాకుండా.. ఇతర అన్ని దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు స్వయంగా ఆ సంస్థ, అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఇంతకుముందు మహేష్ నటించిన 3 సినిమాల్ని ఓవర్సీస్ రిలీజ్ చేసింది ఈ సంస్థ. అతడు, పోకిరి, భరత్ అనే నేను సినిమాలు ఈ సంస్థ ద్వారా వచ్చాయి. వీటిలో పోకిరి సినిమా గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అతడు సినిమా డొమస్టిక్ గా ఫ్లాప్ అయినా, ఓవర్సీస్ లో మంచి లాభాలు తెచ్చిపెట్టింది. భరత్ అనే నేను సినిమాకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు మిగల్లేదు. ప్రచారం పేరిట ఇంకాస్త ఎక్కువే ఖర్చయినట్టు తెలుస్తోంది.
అందుకే మహర్షి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదు సదరు సంస్థ. కానీ ఓవర్సీస్ పై ఈ సంస్థకు ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకొని, కాస్త బుజ్జగించి మరీ ఓవర్సీస్ రైట్స్ ఈ సంస్థకే అప్పగించారని టాక్.