Telugu Global
NEWS

గల్లా జయదేవ్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్‌కి షాక్ తగిలింది. మంగళవారం రాత్రి నుంచి ఆయనకు చెందిన కార్యాలయాలతో పాటు అతని కంపెనీ ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జయదేవ్ కంపెనీలో ఛీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న గుర్రప్పనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు లెక్కాపత్రాలు లేని 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2014లో ఎన్నికైన ఎంపీలలో అమర్‌రాజా కంపెనీ ఎండీ అయిన జయదేవ్ […]

గల్లా జయదేవ్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
X

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్‌కి షాక్ తగిలింది. మంగళవారం రాత్రి నుంచి ఆయనకు చెందిన కార్యాలయాలతో పాటు అతని కంపెనీ ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

జయదేవ్ కంపెనీలో ఛీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న గుర్రప్పనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు లెక్కాపత్రాలు లేని 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

2014లో ఎన్నికైన ఎంపీలలో అమర్‌రాజా కంపెనీ ఎండీ అయిన జయదేవ్ అత్యంత ధనవంతునిగా రికార్డులకెక్కారు. నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఆస్తులు 680 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.

ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన గుంటూరులోని పట్టాభిపురంలో టీడీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. కావాలనే నన్ను, టీడీపీని టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఉన్న వారందరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

First Published:  10 April 2019 5:06 AM IST
Next Story