జనం ఇలా డిసైడ్ అయ్యారట...!
ఏపీలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో ఈ చర్చ జరుగుతోంది. జగన్ కు ఒక్క అవకాశం ఇద్దాం…. ఇస్తే ఎలా చేస్తారో చూద్దాం అనే మాటలు నడుస్తున్నాయి. ఏ ఇద్దరూ ప్రజలు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతకు అధికారం ఇస్తే చేసేంది ఏం లేదు. అప్పులు తెచ్చారు. రాష్ట్రాన్ని ఆగం చేశారు. కులగజ్జిని పెంచి పోషించారు. ధర్మపోరాటల పేరుతో టైమ్ […]
ఏపీలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో ఈ చర్చ జరుగుతోంది. జగన్ కు ఒక్క అవకాశం ఇద్దాం…. ఇస్తే ఎలా చేస్తారో చూద్దాం అనే మాటలు నడుస్తున్నాయి. ఏ ఇద్దరూ ప్రజలు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతకు అధికారం ఇస్తే చేసేంది ఏం లేదు. అప్పులు తెచ్చారు. రాష్ట్రాన్ని ఆగం చేశారు. కులగజ్జిని పెంచి పోషించారు. ధర్మపోరాటల పేరుతో టైమ్ వేస్ట్ చేశారు. కానీ రాష్ట్రం కోసం చేసింది ఏం లేదు.
ఒడిషాలో నవీన్ పట్నాయక్ తన రాష్ట్రం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు తనకు సంబంధం లేని అంశాల్లో వేలు పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. పైగా చెడ్డపేరు తెచ్చారు. అనవసరంగా ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో వెళ్లి వివిధ రాష్ట్రాల్లో ధర్నాలలో పాల్గొనడం వల్ల రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు. డబ్బు ఖర్చు తప్ప… చంద్రబాబు హాయాంలో విపరీతంగా అవినీతి పెరిగింది, ఒక కులం ఆధిపత్యం పెరిగింది. దీంతో ఈ విషయాలను బేరీజు వేసుకుంటున్న ప్రజానీకం….జగన్ కు ఒక అవకాశం ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ ఓ రాజకీయ నేతగా ఈ తొమ్మిదేళ్లలో ఎదిగారు, అంతేకాకుండా మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వారి కోసం నవరత్నాలు ప్రకటించారు. జనంకు ఏదైనా చేయాలనే కోరిక జగన్ లో ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించినట్లు అర్ధమవుతోంది. ఇటీవల ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారు జరిపిన ఎన్నికల పర్యటనలో ఇదే విషయం బయటపడింది. పాదయాత్రతో జగన్ ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని ప్రజలు చెప్పుకొచ్చారు. జగన్ ను దగ్గరగా చూసిన జనం… ఆయనపై అంతకముందు టీడీపీ అనుకూల పత్రికలలో జరిపిన ప్రచారం నమ్మడం లేదని తేలింది. మొత్తానికి జగన్ కు అవకాశం ఇద్దామని జనం అనుకున్నట్లు తెలుస్తోంది.