Telugu Global
NEWS

కోడ్ ఉల్లంఘించి.... ఈరోజు కూడా పరిటాల ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ రెండు రోజులు ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేసి తీరుతామని సీఈవో గోపాల కృష్ణ ద్వివేది ప్రకటించారు. అయినా అధికార టీడీపీ నాయకులు మాత్రం యధేచ్చగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇవాళ కూడా ప్రచారం చేస్తూ కోడ్‌తో మాకేం పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం ఇవాళ రామగిరి, చెర్లోపల్లిలో ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా […]

కోడ్ ఉల్లంఘించి.... ఈరోజు కూడా పరిటాల ఎన్నికల ప్రచారం
X

ఏపీలో ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ రెండు రోజులు ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేసి తీరుతామని సీఈవో గోపాల కృష్ణ ద్వివేది ప్రకటించారు. అయినా అధికార టీడీపీ నాయకులు మాత్రం యధేచ్చగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు.

నిబంధనలకు విరుద్దంగా ఇవాళ కూడా ప్రచారం చేస్తూ కోడ్‌తో మాకేం పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం ఇవాళ రామగిరి, చెర్లోపల్లిలో ప్రచారం చేస్తున్నారు.

అంతే కాకుండా టీడీపీకి ఓటు వేయకపోతే చంపేస్తామంటూ ఆయన వర్గీయులు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీకి సహకరించకపోతే అంతు చూస్తామంటూ ముత్యాలు అనే వ్యక్తిపై పరిటాల అనుచరులు దాడికి దిగారు.

మరోవైపు పరిటాల సునీత అనుచరులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తుండటంతో చెర్లోపల్లి గ్రామస్తులు వారిని నిర్బంధించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా అటువైపు నుంచి కనీసం స్పందన లేదు.

పరిటాల వర్గీయులు ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు చేస్తూ, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ వైసీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆవేదన చెందారు.

మంత్రికి పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే ఈసీకి పిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

First Published:  10 April 2019 5:57 AM IST
Next Story