కేసీఆర్‌కు నోటీసులు పంపిన ఈసీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఒక సభలో హిందువులను కించ పరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి పిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఎం కేసీఆర్‌కు సీఈసీ నోటీసులు పంపింది. గత నెల 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఒక సభలో హిందువులను కించ పరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి పిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఎం కేసీఆర్‌కు సీఈసీ నోటీసులు పంపింది.
గత నెల 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేస్తూ.. దీనిపై ఏప్రిల్ 12 తేదీ సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.