Telugu Global
NEWS

మనల్ని పొగుడుకోవడానికి ఏమీ లేదు..... వాళ్ళను తిడదాం

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విషప్రచారంతో విరుచుకుపడేందుకు టీడీపీ అనుకూల మీడియా సన్నాహాలు చేసుకుంటోంది. ఉచ్ఛనీచాలు విస్మరించి, జగన్ పై విషం చిమ్మడానికి, ఓటర్ల హృదయాలను కలుషితం చేసి, వారి మనసుల్లో విద్వేషాన్నినాటేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని టీడీపీ సూచనల మేరకు పచ్చ మీడియా తీర్మానించుకున్నట్టు సమాచారం. ‘విషపు నాగులు, తిమింగలాలు, బకాసురులు, బందిపోట్లు, దోపిడి ముఠాలు’ ఇలాంటి పదాలు, చిత్రాలతో లేనిపోనివన్నీ కల్పించి అడ్డగోలు […]

మనల్ని పొగుడుకోవడానికి ఏమీ లేదు..... వాళ్ళను తిడదాం
X

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విషప్రచారంతో విరుచుకుపడేందుకు టీడీపీ అనుకూల మీడియా సన్నాహాలు చేసుకుంటోంది. ఉచ్ఛనీచాలు విస్మరించి, జగన్ పై విషం చిమ్మడానికి, ఓటర్ల హృదయాలను కలుషితం చేసి, వారి మనసుల్లో విద్వేషాన్నినాటేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని టీడీపీ సూచనల మేరకు పచ్చ మీడియా తీర్మానించుకున్నట్టు సమాచారం.

‘విషపు నాగులు, తిమింగలాలు, బకాసురులు, బందిపోట్లు, దోపిడి ముఠాలు’ ఇలాంటి పదాలు, చిత్రాలతో లేనిపోనివన్నీ కల్పించి అడ్డగోలు రాతలు, ప్రసారాలతో, పచ్చమీడియా ఓటర్ల మెదళ్లపై దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పచ్చమీడియాకు ఆదేశాలిచ్చిన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభలన్నింటిలోనూ జగన్ పై దూషణలు, విషప్రచారం సాగిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వాధినేతగా గత ఐదేళ్లలో తానేం చేశానో, ఇకపై ఏం చేస్తానో చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో, నిరాశానిస్పృహల్లో ఉన్న చంద్రబాబు, తనకు పూర్తి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందన్న వాస్తవాన్నిఅంగీకరించలేక జగన్ పై విషప్రచారంతో అయినా గట్టెక్కాలని పథకం వేసినట్టు కనిపిస్తోందని, ఎన్నికల ప్రచార సభల్లో ఆయన జగన్ పై సాగిస్తున్న దుష్ప్రచారం ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయినా చంద్రబాబు వ్యవహారశైలిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన ఓటర్లు విజ్ఞతతో, విచక్షణతో ఆలోచించగలరని, ఎవరికి ఓటేయాలో వారు ఇప్పటికే గట్టిగా తీర్మానించుకున్నారని వారంటున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబుకే పరిస్థితి అనుకూలంగా ఉందనే అబద్ధాన్ని జనం మెదళ్లలోకి బలవంతంగానైనా చొప్పించేందుకు పచ్చమీడియా ఇప్పటికే పలు విన్యాసాలు చేసింది. టీడీపీకి పరిస్థితి అనుకూలంగా ఉందంటూ తోక పత్రికలో నకిలీ సర్వేలు కూడా ప్రచురితమవుతున్నాయి.

ఎన్నికలవేళ చంద్రబాబుకోసం మరిన్ని కుట్రలను కూడా టీడీపీ, పచ్చ మీడియా పెద్దలు ఇప్పటికే అమలు చేశారు. చంద్రబాబును కేంద్రం చక్రబంధంలో ఇరికిస్తోందంటూ సానుభూతి కోసం ఐటీ శాఖ పేరిట నకిలీ దాడులను ప్లాన్ చేసినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో జగన్ కుటుంబంపై విషప్రచారం చేసినా, వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతిపై కేసు పెట్టించి, ప్రచారం చేసినా, విజయసాయిరెడ్డి పేరిట నకిలీ ఆడియో టేపులు విడుదల చేసినా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తివేస్తూ, జగన్ ను తెగడుతూ, వార్తలు విశ్లేషణలు వండి వార్చినా, రాష్ట్రానికి చంద్రబాబే దిక్కంటూ గరుడ పురాణం శివాజీ చేత ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించినా వారు ఆశించిన ఫలితాలనివ్వలేదని, వాటితో జనం పెద్దగా ప్రభావితం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో చివరకు జగన్ పై భారీ ఎత్తున విషం చిమ్మేందుకు పచ్చమీడియా సిద్ధపడుతోందని చెబుతున్నారు.

First Published:  9 April 2019 6:41 AM IST
Next Story