పవన్‌కు రెండు చోట్లా కష్టమేనా?
ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం అటుంచితే తాను పోటీ చేస్తున్న రెండు స్థానాలను కూడా గెలవలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయనకు అందుతున్న సర్వేలే చెబుతున్నాయట. దీంతో పవన్ మనస్థాపంతో ఉంటున్నారని జనసైనికులు తెగ ఇదై పోతున్నారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తున్న పవన్… గెలిచాక ఇక్కడ ఉండరని ఆ రెండు స్థానాల్లో బరిలో ఉన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. […]

ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం అటుంచితే తాను పోటీ చేస్తున్న రెండు స్థానాలను కూడా గెలవలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయనకు అందుతున్న సర్వేలే చెబుతున్నాయట.
దీంతో పవన్ మనస్థాపంతో ఉంటున్నారని జనసైనికులు తెగ ఇదై పోతున్నారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తున్న పవన్… గెలిచాక ఇక్కడ ఉండరని ఆ రెండు స్థానాల్లో బరిలో ఉన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కు దిగిన పవన్ ఎట్టకేలకు గాజువాకలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ్నుంచి భీమవరంలో పరిస్థితులు మరింత దిగజారడం మొదలైంది.
ఇక భీమవరంను పవన్ కళ్యాణ్ వదిలేసినట్టేనని స్థానికంగా ప్రచారం ఊపందుకోవడంతో వివరణ ఇచ్చుకోలేక జనసైనికులు నానా అవస్థలు పడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కు అక్కడి పరిస్థితులపై అవగాహన లేదని కూడా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఒకపక్క పవన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుండగా ఆయన తరఫున రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వహించేవారే లేకుండా పోయారు.
కింది స్థాయి కార్యకర్తలు ఉన్నా డబ్బు ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. కొంతమంది జనసేన నాయకులైతే పవన్ వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు నియోజక వర్గాల్లో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఒకే ఒక కారణంతో ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు తప్పించి మా మీద ప్రేమ ఉండి కాదని వాపోతున్నారు.
కాపులు ఓట్లు కోరుకుంటున్నారే కానీ.. కాపు ఉద్యమ సమయంలో టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఏనాడూ పవన్ నోరు మెదపలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పవన్‌ను నమ్మి ఓటేసి తమ ఓటును వృథా చేసుకోలేమని చెబుతున్నారు. రాసిచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప పవన్ కు విషయ పరిజ్ఞానం లేదని.. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారికి కూడా ఆయన దగ్గరకు వెళ్లేందుకు యాక్సిస్ ఉండదని అపవాదులు కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు స్థానాల్లోనూ పవన్‌కు భారీ షాక్ తప్పేలా లేదు.