జనసేనకు.... నితిన్ 25 లక్షలు డొనేషన్....
నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో గతంలో పలు వేదికల మీద చెప్పిన విషయం తెలిసిందే. చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగులను, పోస్టర్లు కూడా పెట్టి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో నితిన్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎలక్షన్స్ నేపథ్యంలో జనసేన పార్టీ […]

నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో గతంలో పలు వేదికల మీద చెప్పిన విషయం తెలిసిందే. చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగులను, పోస్టర్లు కూడా పెట్టి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాడు.
సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో నితిన్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎలక్షన్స్ నేపథ్యంలో జనసేన పార్టీ కోసం నితిన్ పూర్తి మద్దతు ప్రకటించాడు.
ఈ మధ్యనే నితిన్ మరియు అతని తండ్రి సుధాకర్ రెడ్డి …. పవన్ కళ్యాణ్ ను భీమవరంలో కలిశారు. అంతేకాక జనసేన పార్టీ కోసం వారు ఏకంగా 25 లక్షలు డొనేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని స్వీకరించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ట్విట్టర్ లో తెలిపింది.
ఈమధ్య క్యాంపెయిన్ ల వలన బిజీ అయిన పవన్ కళ్యాణ్ డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యం పాలయ్యారు అని తెలిసిన విషయమే. నితిన్, అతని తండ్రి…. పవన్ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ భీమవరం మరియు గాజువాక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.
జనసేన పార్టీకి హీరో శ్రీ నితిన్ @actor_nithiin రూ.25 లక్షల విరాళం
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2019