Telugu Global
NEWS

ప్రచారం నుంచి గడప గడపకు....

ఎన్నికల ప్రచారానికి సాధారణంగా దూరంగా ఉండే నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడం, ప్రచారఘట్టం ఇక రెండు రోజుల్లో ముగియనుండగా వారు ప్రచారంలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు మద్ధతుగా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడంలో వింత ఏమీ లేకున్నా, ఆలస్యంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం వెనక కారణాలను విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు మనవడిని కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకుని వచ్చి సెంటిమెంట్ పండించే యత్నం చేశారని, టీడీపీ […]

ప్రచారం నుంచి గడప గడపకు....
X

ఎన్నికల ప్రచారానికి సాధారణంగా దూరంగా ఉండే నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడం, ప్రచారఘట్టం ఇక రెండు రోజుల్లో ముగియనుండగా వారు ప్రచారంలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు మద్ధతుగా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడంలో వింత ఏమీ లేకున్నా, ఆలస్యంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం వెనక కారణాలను విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు మనవడిని కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకుని వచ్చి సెంటిమెంట్ పండించే యత్నం చేశారని, టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టంగా మారడం, అటు వైసీపీలో జగన్‌, విజయమ్మ, షర్మిలా ప్రచారంలో దూసుకుపోతూ ఉండడం…. వాళ్ళ సభలకు ప్రజలు విపరీతంగా రావడం నారా కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది.

ఇటువైపు టీడీపీ తరపున చంద్రబాబు ఒక్కడే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లోకేష్‌ ప్రచారం చేసినా అస్తవ్యస్తంగా మాట్లాడడం వల్ల అది పార్టీకి మైనస్‌ పాయింట్‌ అవుతోంది. అలాగే బాలకృష్ణ ప్రచారం కూడా టీడీపీకి ఓట్లు సంపాదించకపోగా ఆయన దుందుడుకు స్వభావంతో ప్రజలకు ఏహ్యం కలిగిస్తున్నాడు.

ఈ లోపాలను అదిగమించేందుకు మంగళగిరిలో హడావుడిగా బ్రాహ్మణి రోడ్ షో ఏర్పాటు చేశారు. ఆమె పర్యటన కొంచమైనా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశించిన ఆ ప్రాంతానికి చెందిన నాయకులు , బ్రాహ్మణి తెలుగు కూడా లోకేష్ ప్రసంగం తరహాలోనే అరకొరగా ఉండటంతో కార్యకర్తలు డీలా పడిపోయారు.

నియోజకవర్గంలో బ్రాహ్మణి పర్యటించకపోవడమే మంచిదని, అయితే ఈ విషయం సూటిగా చెబితే పరిస్థితి తమకే రివర్సు అవుతుందన్న ఆలోచనతో, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆమెను గడపగడపకు తీసుకెళ్లడమే మేలన్నట్లు తలచి ప్రచార స్టైల్ ను మార్చారని చెపుతున్నారు.

First Published:  9 April 2019 5:09 AM IST
Next Story