మా ఫిర్యాదుల్ని ఈసీ పట్టించుకోవడం లేదు....
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై మేము చేస్తున్న ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్న డీజీపీని మార్చమని అడిగామని దీనిపై ఎన్నికల సంఘం స్పందించలేదని… అలాగే గుంటూరు రూరల్, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లను మార్చమని అడిగామని… దీనిపై కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని…. అలాగే మరికొంతమంది ఆఫీసర్లను […]
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై మేము చేస్తున్న ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వానికి ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్న డీజీపీని మార్చమని అడిగామని దీనిపై ఎన్నికల సంఘం స్పందించలేదని… అలాగే గుంటూరు రూరల్, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లను మార్చమని అడిగామని… దీనిపై కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని…. అలాగే మరికొంతమంది ఆఫీసర్లను మార్చమని అడిగామని కానీ ఈసీ స్పందించలేదన్నారు.
మా పార్టీ ఫ్యాన్‌ను పోలిన ఫ్యాన్ ఉండే హెలికాప్టర్ గుర్తును ప్రజాశాంతి పార్టీకి కేటాయించవద్దని కోరామని అయినా ఎన్నికల సంఘం కేటాయించిందని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఫిర్యాదుల పై ఎన్నికల సంఘం మాకు న్యాయం చేయలేదని విజయసాయి రెడ్డి చెప్పారు. అయితే వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఏమిటనేది మాకు తెలుసని…. సందర్భాన్ని బట్టి త్వరలో ఆ వివరాలను మీకు అందజేస్తామని ఆయన అన్నారు.