Telugu Global
NEWS

రాజకీయ నాయకుల ప్రసంగాలపై.... ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలలో కుల, మతాలను పేర్కుంటున్న విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15 లోగా తమ నోటీసులకు జవాబు చెప్పాలని పేర్కొంది. గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు తాము చేసే […]

రాజకీయ నాయకుల ప్రసంగాలపై.... ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
X

తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలలో కుల, మతాలను పేర్కుంటున్న విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15 లోగా తమ నోటీసులకు జవాబు చెప్పాలని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు తాము చేసే ప్రసంగాలు, ప్రకటనల్లో ఎక్కువగా కుల, మతాలను ప్రస్తావిస్తున్నారని.. రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలను అడ్డుకోవాలనీ.. సదరు నాయకులపై చర్యలు తీసుకోవాలని హర్‌ప్రీత్ మన్సుఖనీ అనే ఎన్ఆర్ఐ సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

టీవీ చర్చల్లో కూడా ఇలాంటి ప్రస్తావనలు వస్తున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈసీ వెంటనే దీనిపై తమ వాదనను వినిపించాలని కోరింది. కేసు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

First Published:  8 April 2019 3:53 AM
Next Story