Telugu Global
Cinema & Entertainment

రెజీనా ప్రేమ లో ఉన్నది ఎవరితోనో తెలుసా?

రెజీనా తెలుగు సినిమా పరిశ్రమ లోని యువ నాయికల్లో ఒకరు. మొదటి సినిమాతోనే అందరి మెప్పు పొందిన రెజీనా, మెల్లగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ తెలుగు మరియు తమిళ భాషల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. యువతలో కూడా రెజీనా అంటే మంచి క్రేజ్ ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి…. రెజీనా తాను నటించిన హీరోల్లో ఒకరితో డేటింగ్ లో ఉంది అనే వార్తలు ఎక్కువ గా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు […]

రెజీనా ప్రేమ లో ఉన్నది ఎవరితోనో తెలుసా?
X

రెజీనా తెలుగు సినిమా పరిశ్రమ లోని యువ నాయికల్లో ఒకరు. మొదటి సినిమాతోనే అందరి మెప్పు పొందిన రెజీనా, మెల్లగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ తెలుగు మరియు తమిళ భాషల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. యువతలో కూడా రెజీనా అంటే మంచి క్రేజ్ ఉంది.

అయితే కొద్ది రోజుల నుంచి…. రెజీనా తాను నటించిన హీరోల్లో ఒకరితో డేటింగ్ లో ఉంది అనే వార్తలు ఎక్కువ గా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

అయితే ఇదే విషయం రెజీనా వరకు వెళ్ళింది. రెజీనా ఈ విషయం పైన స్పందిస్తూ…. తాను ఎవరితో డేటింగ్ లో లేనని, ప్రస్తుతం తనకి అత్యంత ప్రేమ ఉన్నది ఒక్క వృత్తి మీద నే అని, ఒకవేళ ఎవరితోనైనా డేట్ చేస్తే తప్పక ముందుగానే అందరికీ చెప్తాను అని స్పందించింది.

తెలుగు లో ”అ!” సినిమా తర్వాత ఇంకేం సినిమా చేయని రెజీనా ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఆ మధ్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రెజీనా…. హిందీ లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

First Published:  8 April 2019 5:51 AM IST
Next Story