వాళ్ళ అవసరాలు శివాజీ తీరుస్తున్నాడు.... అందుకే అతనిని హైలైట్ చేస్తున్నారు
నిన్న నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు పోసాని కృష్ణమురళి. ఒక మనిషి ఊసరవెల్లిగా ఎన్ని రంగులు మారుస్తాడో చెబుతానన్న పోసాని…. శివాజీ గతంలో మాట్లాడిన, ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోలను పక్కపక్కన పెట్టి చూపించారు. గతంలో చంద్రబాబును దెయ్యమన్న శివాజీకి…. ఇప్పుడు దేవుడైపోయాడా? అని ఆ వీడియోలను ప్రదర్శిస్తూ ప్రశ్నించారు పోసాని. ఇవి కొన్ని వీడియోలేనని…. ఆఫ్ ద రికార్డ్‌లో ఇలాంటివి శివాజీ చాలానే మాట్లాడాడని చెప్పారు […]
నిన్న నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు పోసాని కృష్ణమురళి.
ఒక మనిషి ఊసరవెల్లిగా ఎన్ని రంగులు మారుస్తాడో చెబుతానన్న పోసాని…. శివాజీ గతంలో మాట్లాడిన, ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోలను పక్కపక్కన పెట్టి చూపించారు.
గతంలో చంద్రబాబును దెయ్యమన్న శివాజీకి…. ఇప్పుడు దేవుడైపోయాడా? అని ఆ వీడియోలను ప్రదర్శిస్తూ ప్రశ్నించారు పోసాని. ఇవి కొన్ని వీడియోలేనని…. ఆఫ్ ద రికార్డ్‌లో ఇలాంటివి శివాజీ చాలానే మాట్లాడాడని చెప్పారు పోసాని.
టీవీ9 రవిప్రకాశ్, ఏబీఎన్ రాధాకృష్ణ లు శివాజీతో కలిసి ఇలా మాట్లాడిస్తున్నారన్నారు పోసాని. జగన్‌ను అన్‌పాపులర్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ శివాజీ ఆఫ్‌ది రికార్డులో రవిప్రకాశ్ పై చాలా నీచమైన మాటలే మాట్లాడాడని పోసాని మీడియాతో అన్నారు. ఈ విషయాలను రవిప్రకాశ్ ను స్వయంగా కలిసి చెబుతానని చెప్పారు.
శివాజీ ప్రెస్‌మీట్లు గానీ, ఇంటర్వ్యూలు గానీ కేవలం టీవీ9 లోనే రావడానికి కారణం ఏంటా అని ఆ సంస్థలో ఒక ఉద్యోగిని అడగగా అతను…. ఇది మా కర్మ అని సమాధానం ఇచ్చాడని పోసాని అన్నారు. రవిప్రకాశ్ కు కావాల్సిన అవసరాలను శివాజీ తీరుస్తున్నాడని… దానికి ప్రతిఫలంగా శివాజీకి సంబంధించిన ప్రెస్‌మీట్లను టీవీ9 లో హైలైట్ చేసి చూపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు పోసాని. మీడియా అంటే ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి అని గుర్తు చేశారు.
శివాజీ ఏ నోటితో చంద్రబాబును పొగిడాడో… అదే నోటితో తిట్టాడని చెబుతూ ఆ వీడియోలను చూపిస్తూ మాట్లాడారు పోసాని. శివాజీ ఒక మతిస్థితిమితంలేని వ్యక్తి అని, ఇలా డబుల్ టంగ్ తో మాట్లాడే వారిని ప్రజలు నిలదీయాలని కోరారు పోసాని.
కేవలం జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతీయడానికే శివాజీ ప్రయత్నిస్తున్నాడని… దీనినే ప్రజలకు గుర్తు చేస్తున్నానని పోసాని చెప్పారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారని చెప్పారు.
చంద్రబాబు ఎన్టీఆర్ చావుకు కారణమయ్యాడని, కానీ జగన్ మాత్రం వైఎస్ మారణం తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చేందుకు… ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడం తోనే జగన్ బయటకువచ్చారని…. వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారని గుర్తుచేశారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట మార్చారని, కానీ జగన్ మాత్రం ఒకేమాట మీద నిలబడ్డాడని చెప్పారు పోసాని.
కేసీఆర్‌కు ఏపీలో ఏం పని అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, కానీ ఇదే చంద్రబాబు జాతీయ నాయకులను ప్రచారానికి ఎందుకు తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. గతంలో మెదీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌ను బండబూతులు తిడ్డాడని… కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మోడీని తిడుతున్నాడన్నారు.
లక్ష్మీ పార్వతి ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారని, ఎన్టీఆర్ సతీమణి గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, 70 ఏళ్ళ స్త్రీ గురించి ఇలా మాట్లాడడం, ప్రచారం చేయడం వాళ్ళకే చెల్లింది అంటూ మండిపడ్డారు పోసాని. చంద్రబాబు ఎవరినైనా అవసరానికి వాడుకుని వదిలేస్తాడని, పార్టీలోని ఆడవాళ్ళకు కూడా చంద్రబాబు గౌరవం ఇవ్వరని మండిపడ్డారు పోసాని.
చంద్రబాబు ఒక మేకవన్నె పులి అని, పవన్ కళ్యాణ్ అది గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నానన్నారు పోసాని.
మూడు శాఖలకు మంత్రిగా ఉన్న లోకేష్ ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు కులపిచ్చి విపరీతంగా ఉందని, చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని నమ్మవద్దని, చంద్రబాబుకు ఓటేస్తే ఒక సామాజిక వర్గానికే ఓటు వేసినట్టేనన్నారు పోసాని.
వైఎస్ జగన్‌కు ఒక అవకాశం ఇవ్వండని, ఆయన పాలన చూశాక మీరే మళ్ళీ మళ్ళీ ఓటేస్తారని ప్రజలను కోరారు పోసాని.