ఎన్టీఆర్‌పై గౌరవం ఇదేనా బాబూ?
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంతటి తృణీకార భావం ఉందో, బట్టబయలుచేసే వీడియో సోషల్ మీడియాలో బయటపడటం టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు విస్తుపోతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తాము ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పనిచేస్తున్నామని చెప్పుకోవడం, పదిమంది సమక్షంలో ఆయనకు పూలదండలు వేయడం, ప్రైవేటుగా ఆయన్ను ”వాడు” అంటూ తృణీకార భావంతో మాట్లాడటం ఏమిటని తెలుగుదేశం నేతలు […]
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంతటి తృణీకార భావం ఉందో, బట్టబయలుచేసే వీడియో సోషల్ మీడియాలో బయటపడటం టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు విస్తుపోతున్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం తాము ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పనిచేస్తున్నామని చెప్పుకోవడం, పదిమంది సమక్షంలో ఆయనకు పూలదండలు వేయడం, ప్రైవేటుగా ఆయన్ను ”వాడు” అంటూ తృణీకార భావంతో మాట్లాడటం ఏమిటని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుకు, రాధాకృష్ణల మధ్య ఓ లైవ్ ప్రోగ్రాంకు ముందు ప్రైవేటుగా జరిగిన చర్చ వీడియో రికార్డింగ్ చూసిన వారు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవల పథకంపై ఓ ప్రాంతం నుంచి ప్రత్యక్షప్రసారం తీసుకోవాలని టీవీ సిబ్బంది చెప్పగానే…
ఇంకా ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందా? అని రాధాకృష్ణ ప్రశ్నించడం, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతూ, ‘మార్చేస్తున్నాం. పేరు మార్చేస్తున్నాం అంటూ అందులో ఎన్టీఆర్ ను ‘వాడు‘ అని అనడంతోపాటు.. ‘పేరు తీసేస్తాం‘ అని చెప్పారు. ‘ఏదో కొన్ని క్యారీ చేయాలి కాబట్టి చేస్తున్నాం. వాడి పని అయిపోయింది‘ అని చంద్రబాబు వ్యాఖ్యానించటం టీడీపీలో దుమారం రేపుతోంది.
జనం సమక్షంలో మాత్రం ఎన్టీఆర్ కు పూలదండలు వెయ్యడం, ప్రైవేటుగా కూర్చున్నప్పుడు ‘వాడు‘ ‘వీడు‘ అనడం పార్టీ నేతలు భరించలేక పోతున్నారు. ఎన్టీఆర్ బతికి ఉండగానే ఆయన దగ్గర నుంచి పార్టీని లాగేసుకున్న చంద్రబాబు అసలు రూపమేమిటో ఇపుడు తెలుస్తోందని వారంటున్నారు.
ఎన్టీఆర్ అంటే ఇష్టపడనివారు, ఆయన భావజాలం నచ్చనివారు కూడా ఎన్టీఆర్ ను ‘వాడు‘ అని ఎప్పుడూ సంబోధించలేదని… సినిమాల్లో ఆయనకు అవకాశాలు ఇచ్చిన నాగిరెడ్డి, చక్రపాణి, కేవీ రెడ్డి లాంటి మహామహులు కూడా ఎన్టీఆర్‌ను ఎంతో గౌరవంగా సంబోధించేవారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ ను ‘వాడు‘ అని ప్రస్తావించిన చంద్రబాబును ప్రజలు చీకొట్టే రోజు వచ్చిందని జనం అంటున్నారు.
ఓ వైపు ఎన్టీఆర్‌ను ‘వాడు‘ అంటూ అవమానించిన చంద్రబాబు… ఎన్నికల ప్రచార సభల్లో ‘తమ్ముళ్లూ మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా‘? అంటూ జనాన్ని బ్లాక్ మెయిల్ చేసే రీతిలో ప్రసంగించడాన్ని పార్టీనేతలు, జనం తీవ్రంగా నిరసిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దూషించే ఊపులో తానేమి మాట్లాడుతున్నానో అన్న స్పృహ కూడా లేకుండా, చంద్రబాబు ఏకంగా ప్రజలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘ఏం తమ్ముళ్ళూ మీకు సిగ్గు లేదా.? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరుషం లేదా.? ఏం, మీరు కేసీఆర్‌కి ఊడిగం చేస్తారా.? రాష్ట్ర ప్రజలకు ఆ ఖర్మ పట్టకూడదు’ అంటూ ప్రజలను అగౌరవపరుస్తూ, ‘మేం అధికారంలోకి రాకపోతే ఫలానా పథకం ఆగిపోతుంది’ అని బ్లాక్ మెయిల్ చేయడం దిగజారుడు రాజకీయాలకు తలపిస్తోందని అంటున్నారు.
రోజూ నాలుగైదు ప్రచార సభల్లో పదేపదే ఇలా మాట్లాడటం చూసి జనం విస్తుపోతున్నారు. కేసీఆర్‌ను విమర్శించడం ద్వారా సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవచ్చనే భ్రమలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకువస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతటి దిగజారుడు రాజకీయాలు దేశ చరిత్రలోనే ఇంకెవరూ చేసి ఉండరని సభలకు హాజరవుతున్నవారు, టెలివిజన్లలో ఆ సభలను చూస్తున్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు.