బయటకొచ్చిన ఆంధ్రా ఆక్టోపస్.... త్వరలో సర్వే వివరాలు వెల్లడిస్తానంటున్న లగడపాటి
వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అయిన లగడపాటి సర్వేలకు ఒకప్పుడు చాలా గిరాకీ ఉండేది. అప్పుడప్పుడు ఆయన చేసే సర్వేలు నిజమవుతూ ఉండేవి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన చాలా హల్ చల్ చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఓడిపోబోతున్నారో లీకులు ఇచ్చారు. ప్రెస్ మీట్లు పెడుతూ కేసీఆర్ ఓడిపోతున్నాడు.. టీఆర్ఎస్ ఓటమి అంటూ సర్వేల పేరిట పలు ప్రకటనలు చేశారు. మహాకూటమి గెలుస్తుందంటూ బీరాలు పలికిన లగడపాటి ఎన్నికల ఫలితాల తర్వాత కనపడకుండా […]

వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అయిన లగడపాటి సర్వేలకు ఒకప్పుడు చాలా గిరాకీ ఉండేది. అప్పుడప్పుడు ఆయన చేసే సర్వేలు నిజమవుతూ ఉండేవి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన చాలా హల్ చల్ చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఓడిపోబోతున్నారో లీకులు ఇచ్చారు.
ప్రెస్ మీట్లు పెడుతూ కేసీఆర్ ఓడిపోతున్నాడు.. టీఆర్ఎస్ ఓటమి అంటూ సర్వేల పేరిట పలు ప్రకటనలు చేశారు. మహాకూటమి గెలుస్తుందంటూ బీరాలు పలికిన లగడపాటి ఎన్నికల ఫలితాల తర్వాత కనపడకుండా మాయమయ్యారు. అతని సర్వేలన్నీ ఫేక్ అనీ.. ఏదో నోటికొచ్చినట్లు వాగి.. తనకు అనుకూలంగా ఉంటే చూశారా నా సర్వే అంటూ గొప్పలు చెప్పుకుంటారని రాజకీయ వర్గాల్లో ఎన్నటి నుంచో ఉన్న మాట. అయితే ఆయన సర్వేలకు తెలంగాణ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టిన తర్వాత బయట కనిపించడం లేదు.
తాజాగా ఇవాళ ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ఎన్నికలపై సర్వే చేశానని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో తనకు తెలుసునంటూ గోడ మీది పిల్లి వాటంలా మాట్లాడారు. అందరికీ మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరి త్వరలో ఆయన చెప్పే సర్వే ఏమిటో మరి..!