కేసీఆర్ సర్వే.... ఏపీలో జగన్‌దే అధికారం
ఎన్నికల ప్రచారానికి మరో 24 గంటల్లో తెరపడనున్న సమయంలో తెలంగాణ గడ్డపై నుంచి కేసీఆర్ సంచలన సర్వేను ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోందో కేసీఆర్ బహిరంగంగా వెల్లడించారు. ఇవాళ వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన సభలో ఆయన ఈ మాటలు చెప్పారు. తాను ఒక సర్వే చేయించానని.. అందులో చాలా చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిందని.. వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోనికి రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం […]
ఎన్నికల ప్రచారానికి మరో 24 గంటల్లో తెరపడనున్న సమయంలో తెలంగాణ గడ్డపై నుంచి కేసీఆర్ సంచలన సర్వేను ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోందో కేసీఆర్ బహిరంగంగా వెల్లడించారు. ఇవాళ వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన సభలో ఆయన ఈ మాటలు చెప్పారు.
తాను ఒక సర్వే చేయించానని.. అందులో చాలా చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిందని.. వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోనికి రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం ముందే చంద్రబాబుకు తెలుసని.. ఆయన చేసుకున్న సర్వేల్లో కూడా ఇదే విషయం వెలువడటంతో అవాకులు చెవాలకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఓడిపోబోతున్నామనే ఫ్రస్ట్రేషన్‌లోనే చంద్రబాబు తెలంగాణపై, నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఇక జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించడమే కాకుండా పార్లమెంటు సీట్లను కూడా భారీగా గెలుచుకోబోతున్నారని కేసీఆర్ చెప్పారు. దీంతో పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత పెరగబోతోందని అన్నారు.
కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ స్టార్ట్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ చంద్రబాబు ఏం మాట్లాడినా స్పందించని కేసీఆర్.. మరి కొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసి చంద్రబాబును ఇరకాటంలో పడేసినట్లైంది.