మే 19 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
తొలి విడత ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి మే 19వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పత్రికల్లో ప్రచురించడం గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం గానీ పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు వెలువరించింది. తొలి విడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి మే 19 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎగ్జిట్ […]
తొలి విడత ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి మే 19వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పత్రికల్లో ప్రచురించడం గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం గానీ పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు వెలువరించింది.
తొలి విడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి మే 19 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎగ్జిట్ పోల్స్ తో సహా.. ఒపీనియన్ పోల్స్, సర్వేలు వంటి ఎలాంటి వాటిని ప్రసారం చేయకూడదని…. ఎన్నికలు ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రసారం చేయకూడదని ఈ ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది.