Telugu Global
NEWS

మరో అభిమాని పై బాలకృష్ణ దాడి

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి పేట్రేగిపోయాడు. ఒక అభిమానిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద కొట్టాడు. విజయనగరం జిల్లా  చీపురుపల్లిలో ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ నడిరోడ్డుపై ఒక యువకుడిని దారుణంగా కొట్టాడు. తన మోకాలితో యువకుడి మర్మాంగంపై తన్నాడు. కర్ర తీసుకుని రోడ్డు మీదే కొట్టాడు. దాంతో ఆ యువకుడు నొప్పికి గిలగిలలాడాడు.  నడిరోడ్డుపై తనకు జరిగిన అవమానంతో కన్నీరు పెట్టుకుని విలపించాడు. బాలకృష్ణ నడిరోడ్డుపై చేసిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇలా […]

మరో అభిమాని పై బాలకృష్ణ దాడి
X

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి పేట్రేగిపోయాడు. ఒక అభిమానిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద కొట్టాడు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ నడిరోడ్డుపై ఒక యువకుడిని దారుణంగా కొట్టాడు. తన మోకాలితో యువకుడి మర్మాంగంపై తన్నాడు. కర్ర తీసుకుని రోడ్డు మీదే కొట్టాడు. దాంతో ఆ యువకుడు నొప్పికి గిలగిలలాడాడు.

నడిరోడ్డుపై తనకు జరిగిన అవమానంతో కన్నీరు పెట్టుకుని విలపించాడు. బాలకృష్ణ నడిరోడ్డుపై చేసిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇలా మనుషులను కొడుతున్నా…నరుకుతా, చంపేస్తా అని హెచ్చరిస్తున్నా ఎన్నికల సంఘం కానీ, పోలీసులు గానీ కనీసం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.

ఛీ..ఛీ.. వీళ్లు నాయకులా? ఇలాంటి వాళ్లను మళ్లీ ఎన్నుకోవాలా?నడిరోడ్డుపై అభిమానిని కొట్టిన నందమూరి బాలకృష్ణ.#BalaKrishna #Vizianagaram #APNeedsYSJagan #VoteForFan #FreeAPFromTDP

Posted by YSR Congress Party – YSRCP on Sunday, 7 April 2019

First Published:  8 April 2019 1:55 AM IST
Next Story