Telugu Global
Cinema & Entertainment

మహర్షి ని అల్లరి నరేష్ బాగానే వాడుకుంటున్నాడు

సినిమా పరిశ్రమ లో మినిమం గ్యారంటీ హీరోలు చాలా తక్కువ. అందులో అల్లరి నరేష్ ఎప్పుడూ ముందు వరసలోనే ఉండేవాడు. అయితే గత రెండు మూడు ఏళ్లుగా నరేష్ కి హిట్ సినిమాలు లేకపోవడం… గతంలో సినిమాలు చేసిన నిర్మాత లు, పంపిణీదారులు చాలా మంది నష్టపోయారు. అల్లరి నరేష్ గ్యాప్ తీసుకుందాం అని ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ఉపయోగ పడలేదు. 53 సినిమా లు పూర్తి చేసిన నరేష్ కి మహర్షి 54 వ […]

మహర్షి ని అల్లరి నరేష్ బాగానే వాడుకుంటున్నాడు
X

సినిమా పరిశ్రమ లో మినిమం గ్యారంటీ హీరోలు చాలా తక్కువ. అందులో అల్లరి నరేష్ ఎప్పుడూ ముందు వరసలోనే ఉండేవాడు. అయితే గత రెండు మూడు ఏళ్లుగా నరేష్ కి హిట్ సినిమాలు లేకపోవడం… గతంలో సినిమాలు చేసిన నిర్మాత లు, పంపిణీదారులు చాలా మంది నష్టపోయారు. అల్లరి నరేష్ గ్యాప్ తీసుకుందాం అని ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ఉపయోగ పడలేదు.

53 సినిమా లు పూర్తి చేసిన నరేష్ కి మహర్షి 54 వ సినిమా. ఈ సినిమా లో నటించడం నరేష్ కెరీర్ కి ఒక పాజిటివ్ అంశం గా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సినిమా లో ని మొదటి పాట ని విడుదల చేశారు. దాని ప్రకారం నరేష్ కూడా పాట లో ముఖ్య భూమిక పోషించనుండటం తో తన కి సంబందించిన పోస్టర్స్ కూడా ఎక్కువ గా కనిపిస్తున్నాయి. మహేష్ అభిమానులు సైతం నరేష్ కి పాజిటివ్ గా ట్వీట్స్ చేయడం, అభినందనలు తెలపడం చేస్తున్నారు.

ఇదే సరైన సమయం అని భావించిన నరేష్ కూడా పనిలో పనిగా మహర్షి క్రేజ్ ని వాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లున్నాడు. తన 55 వ సినిమా ప్రమోషన్స్ ని లైన్ లో పెట్టాడీ సుడిగాడు. ఎ.కె.ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో ఏ టీవీ సమర్పణలో ‘బంగారు బుల్లోడు’ అనే సినిమాని నరేష్ చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టి మహర్షి విడుదల వరకు క్రేజ్ ని వాడుకొని మళ్ళీ పునర్వైభవం అంది పుచ్చుకోవాలనే ఆశ తో ఉన్నాడు నరేష్.

First Published:  8 April 2019 6:24 AM IST
Next Story