Telugu Global
Health & Life Style

రోగ నిరోధక శక్తి @ పాలకూర

పాలకూరను పాలక్ అని, స్పినాచ్ అని పిలుస్తారు. దీనిని ఎలా వండుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నిరంతరం ఫిట్ గా ఉండాలనుకునే వారికి పాలకూర దివ్యౌషధం… పాలకూరలో దాగి ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని, రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ ని పెంచుతుంది. పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో పాలకూరను ఎంత తిన్నా […]

రోగ నిరోధక శక్తి @ పాలకూర
X

పాలకూరను పాలక్ అని, స్పినాచ్ అని పిలుస్తారు. దీనిని ఎలా వండుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నిరంతరం ఫిట్ గా ఉండాలనుకునే వారికి పాలకూర దివ్యౌషధం… పాలకూరలో దాగి ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

  • పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని, రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ ని పెంచుతుంది.
  • పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో పాలకూరను ఎంత తిన్నా కూడా బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు. బరువు తగ్గాలనుకునే వారు పాలకూరను ప్రతిరోజు ఏదో రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు.
  • పాలకూరలో మిటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు కారకమైన క్రిములను అదుపు చేస్తుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ ఎ మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారించడమే కాకుండా.. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులను అదుపు చేయండంలో ముందుంటుంది.
  • వయస్సుతో పాటు వచ్చే మతిమరుపునకు పాలకూర మంచి మందు.
  • ప్రతిరోజూ పాలకూర తింటే ఎథెరోస్క్లెరోసిస్ను, సెరెబ్రల్-వాస్క్యులార్, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
  • పాలకూరలో రక్తాన్ని శుద్దిచేసే గుణాలు అమోఘంగా ఉన్నాయి. ఇది చాలా మంచి రక్త శుద్ధికారకం.
  • పాలకూర తరచు తీసుకునే వారు ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • పాలకూర జీర్ణవ్వవస్ధపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిలో ఉన్న ప్రోటీన్లు శరీరానికి, కండరాలకి బలాన్ని చేకూర్చడమే కాకుండా ఆకలిని చాలాసేపు అదుపులో ఉంచుతుంది.
  • దీనిలో ఉన్న ఫొలిక్ యాసిడ్ గర్భీణీలకు, కడుపులో బిడ్డకు ఎంతో మేలు చేస్తుంది.
  • వయస్సు పెరుగుతున్న కొద్ది కండరాలు వదులవ్వడం సహజమే.. అలాంటప్పుడు తరచూ పాలకూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, రక్తంలో ఉన్న ప్రాణ వాయువును కండరాలకు పూర్తి స్దాయిలో అందించేందుకు తొడ్పుతుంది. ఈ ప్రక్రియ వల్ల మీ కండరాలు బలపడతాయి.
  • పాలకూరలో యాంటీ ఆక్సీడెంట్లు, ఆమ్ల జనకాలు వంటి రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఇవి వాత, పిత్త, వాపులు, జ్వరం వలన వచ్చే ఇతర ఇబ్బందులను కట్టడి చేస్తాయి.
  • ప్రతిరోజు పాలకూర తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు ఆ రోజుకు అందినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • తరచూ పాలకూర తినడం వల్ల ఎముకలు గుల్ల బారడం లేదా ఎముకల సాంద్రత తగ్గిపోవడం (Osteoporosis) వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. పాలకూరతో ఇన్ని ఉపయోగాలుంటే దానిని మనం వదులుకుంటామా.. ఇకపై నిత్యం పాలకూరను మనం ఆహారంలో చేర్చుకుందాం… అన్నట్లు ఓ విషయం…. పాలకూరని టమాటాతో కలిపి తింటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని ఒక వాదన ఉంది. అయితే ఇది సైంటిఫిక్ రుజువు కాలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

First Published:  7 April 2019 2:37 AM IST
Next Story