Telugu Global
NEWS

ఆ ఐదు సంతకాలకే దిక్కులేదు.... ఇక మేనిఫెస్టోనా?

ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయాలు చూస్తుంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం ఏర్పడినట్లుగా నాకు అనిపిస్తోందని జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయ్‌ బాబు అన్నారు. చంద్రబాబు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో బార్బేరియన్‌ కల్చర్‌ వచ్చిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఉగాది రోజున చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ…. ఈ మేనిఫెస్టోలో ఉపోద్ఘాతంలోనే అబద్దాలతో మొదలుపెట్టారని చెబుతూ…. చంద్రబాబు తన రాజకీయ అవకాశవాదాన్ని పొరపాటున బయటపెట్టారని…. ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న…. అవకాశవాద […]

ఆ ఐదు సంతకాలకే దిక్కులేదు.... ఇక మేనిఫెస్టోనా?
X

ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయాలు చూస్తుంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం ఏర్పడినట్లుగా నాకు అనిపిస్తోందని జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయ్‌ బాబు అన్నారు. చంద్రబాబు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో బార్బేరియన్‌ కల్చర్‌ వచ్చిందని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఉగాది రోజున చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ…. ఈ మేనిఫెస్టోలో ఉపోద్ఘాతంలోనే అబద్దాలతో మొదలుపెట్టారని చెబుతూ…. చంద్రబాబు తన రాజకీయ అవకాశవాదాన్ని పొరపాటున బయటపెట్టారని…. ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న…. అవకాశవాద పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమేనని నారా లోకేష్‌ నోరు జారి అన్నట్టు…. చంద్రబాబు కూడా పొరపాటున…. ఆంధ్రప్రదేశ్‌ విభజన సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుని, దాని నుంచి రాజకీయ లబ్ది పొందానని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడం…. ఆయన అవకాశవాదానికి పరాకాష్ట అని విజయ్‌ బాబు అన్నారు.

పోలవరం ముంపు గ్రామాలని ఆంధ్రప్రదేశ్‌లో కలపమని కేంద్రం పై ఒత్తిడి తెచ్చానని, అది తన తొలి విజయం అని మేనిఫెస్టోలో రాసుకున్నారు. నిజానికి ఆ ముంపు గ్రామాలని ఏపీలో కలపమని చంద్రబాబు అడగనే లేదు. ఆయన అడగకముందే కేంద్రం వాటిని ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసింది. కేంద్రం చేసిన పనిని కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు…. ఇదే ఈ మేనిఫెస్టోలో తొలి అబద్ధం.

ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే…. ఈ మేనిఫెస్టోలో విషయాలను, గత మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఏం చేశాడు? మొదలైనవి పరిశీలించే ముందు…. ప్రమాణస్వీకారం రోజే ఐదు ఫైళ్ళ పై సంతకాలు చేశాడు. వాటికే దిక్కులేదు. ఇక మేనిఫెస్టో విషయాల గురించి ఎందుకు మాట్లాడడం…

ఆ రోజు సంతకం చేసిన ఐదు ఫైళ్ళు….

  • ఒకటి… రైతుల రుణమాఫీ… సక్రమంగా అమలు జరగనే లేదు.
  • రెండు… డ్వాక్రా మహిళల రుణమాఫీ…. మహిళలను మోసం చేశాడు. చంద్రబాబును నమ్మి, బ్యాంకు రుణాలు తీర్చకుండా ఇప్పుడు వడ్డీ కట్టుకోలేక మహిళలు అల్లాడిపోతున్నారు.
  • మూడు…. వృద్ధులు, వికలాంగుల పెన్షన్‌ మూడు రెట్టు పెంచుతానని చెప్పి…. మాట తప్పాడు.
  • నాలుగు…. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద ప్రతి ఒక్కళ్ళకూ 20 లీటర్ల తాగునీరు ఇస్తానని చెప్పాడు…. మాట తప్పాడు.
  • ఐదు…. బెల్టు షాపుల రద్దు అన్నాడు…. మాట తప్పాడు. బెల్టు షాపులు ఈ నాలుగేళ్ళలో వంద శాతం పెరిగాయి….

ఇలా ప్రమాణస్వీకారం నాడు చేసిన సంతకాలకే దిక్కులేకపోతే…. ఇక మేనిఫెస్టో గురించి మాట్లాడాలా? అని ఆయన ప్రశ్నించాడు.

First Published:  7 April 2019 9:30 AM IST
Next Story