వైసీపీకి అల్లు అర్జున్ మద్దతు
వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇచ్చారు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక లేఖ విడుదల చేశారు. ‘నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. […]
వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇచ్చారు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక లేఖ విడుదల చేశారు.
‘నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన’ని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.
అదే విధంగా నరసాపురం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న నాగబాబుకు కూడా అల్లు అర్జున్ మద్దతు తెలిపారు.
BEST WISHES pic.twitter.com/65HonIrB3c
— Allu Arjun (@alluarjun) April 6, 2019
WE ARE WITH YOU pic.twitter.com/P5FvBv7Ls2
— Allu Arjun (@alluarjun) April 5, 2019