Telugu Global
Cinema & Entertainment

'బంగారు బుల్లోడు' గా అల్లరి నరేష్

ఒకప్పుడు కామెడీ సినిమాలంటే అల్లరి నరేష్ పేరు ముందుగా గుర్తొచ్చేది. కానీ గత కొంతకాలంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ మధ్యనే ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా కథకు అల్లరి నరేష్ పాత్ర కీలకంగా మారబోతోందని […]

బంగారు బుల్లోడు గా అల్లరి నరేష్
X

ఒకప్పుడు కామెడీ సినిమాలంటే అల్లరి నరేష్ పేరు ముందుగా గుర్తొచ్చేది. కానీ గత కొంతకాలంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

ఈ మధ్యనే ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

ఈ సినిమా కథకు అల్లరి నరేష్ పాత్ర కీలకంగా మారబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. అయితే తాజాగా అల్లరి నరేష్ మళ్ళీ హీరో గా మారనున్నారు.

తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ హీరోగా వరుసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ తదుపరి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.

‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పోస్టర్ లో అల్లరి నరేష్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టు గానే ఒంటినిండా బంగారు ఆభరణాలతో మెరుస్తున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

First Published:  7 April 2019 4:46 AM IST
Next Story