బయోపిక్‌ను అడ్డుకోలేం...
వైఎస్‌ఆర్ బయోపిక్ యాత్ర సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల విడుదలైన వైఎస్‌ఆర్ బయోపిక్ యాత్ర సినిమాను అసలు టీవీల్లో కూడా ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఈసీని ఆశ్రయించారు. ఆదివారం మా టీవీలో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర సినిమా ప్రసారం కాబోతోందని… ఆ సినిమా ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని…. కాబట్టి సినిమా టీవీలో ప్రసారం కాకుండా అడ్డుకోవాలంటూ ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సినిమాను అడ్డుకోవడం కుదరదని […]

వైఎస్‌ఆర్ బయోపిక్ యాత్ర సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల విడుదలైన వైఎస్‌ఆర్ బయోపిక్ యాత్ర సినిమాను అసలు టీవీల్లో కూడా ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఈసీని ఆశ్రయించారు.
ఆదివారం మా టీవీలో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర సినిమా ప్రసారం కాబోతోందని… ఆ సినిమా ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని…. కాబట్టి సినిమా టీవీలో ప్రసారం కాకుండా అడ్డుకోవాలంటూ ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సినిమాను అడ్డుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం సినిమాల ప్రదర్శనను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఒక సినిమా ప్రదర్శన అన్నది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదు అని కూడా స్పష్టం చేసింది. దీంతో యాత్ర సినిమా స్టార్ మాలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది.