ఆదివారం మరో పురాణం వినిపించనున్న శివాజీ?
గరుడ పురాణం ఫేమ్, నటుడు శివాజీ ఆదివారం ఉదయం 9 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు మీద, కియా మోటార్స్ మీద తను చిత్రీకరించిన వీడియోలతో తను ఆహ్వానించే విలేకరులకు ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ శివాజీ మీడియా సమావేశాన్ని, ఆయన ఉపన్యాసాన్ని మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తుంది. అది వాళ్ళ ఇష్టం. అయితే శివాజీ మీడియా సమావేశానికి […]
గరుడ పురాణం ఫేమ్, నటుడు శివాజీ ఆదివారం ఉదయం 9 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు మీద, కియా మోటార్స్ మీద తను చిత్రీకరించిన వీడియోలతో తను ఆహ్వానించే విలేకరులకు ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
ఎలాగూ శివాజీ మీడియా సమావేశాన్ని, ఆయన ఉపన్యాసాన్ని మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తుంది. అది వాళ్ళ ఇష్టం.
అయితే శివాజీ మీడియా సమావేశానికి ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళేవ్వరినీ రానివ్వరు. అందువల్ల ఆయనను ప్రశ్నించే అవకాశం ఉండదు. అయితే కొన్ని ప్రశ్నలకు శివాజీ ఈ సమావేశంలోనైనా సమాధానం చెబితే బాగుంటుంది.
- పోలవరం ప్రాజెక్టులో వైయస్సార్ హయాంలో ఎంత శాతం వర్క్ జరిగింది?
- బాబు హయాంలో ఇప్పటి వరకు ఎంత శాతం వర్క్ జరిగింది?
- నామినేషన్ల పేరిట కాంట్రాక్టర్లకు చంద్రబాబు దోచిపెట్టింది ఎంత?
- పోలవరం కుడి కాల్వను వైయస్సార్ హయాంలో చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారు?
- పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో విహార యాత్రలకు ప్రభుత్వం ఖర్చుపెట్టినది ఎంత?
- కియాలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని?
- మొన్న బాబు విడుదలచేసిన ఫొటోలకు ఫోజులిచ్చిన కారు అసెంబ్లింగ్ కాదా?
- కియాకు ఇచ్చిన ప్రోత్సాహకాలపై స్వేత పత్రం ఇవ్వగలరా?
- రైతులకు ఇచ్చిన పరిహారంకన్నా, భూమి చదును కోసం మూడు రెట్లు ఎక్కువ డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
- భూమి చదునుకోసం రూ.177 కోట్లు ఒక సంస్థకు అప్పనంగా అప్పగించలేదా?
- ఇలాంటి సందేహాలకు కూడా శివాజీ సమాధానం చెబితే బాగుంటుంది.