ఐపీఎల్ -12లో బెంగళూరు చిత్తు చిత్తు
రాయల్ చాలెంజర్స్ వరుసగా ఐదో ఓటమి 205 పరుగుల భారీస్కోరు సాధించినా తప్పని పరాజయం బౌలర్ల చెత్తప్రదర్శన క్షమార్హం కాదన్న కొహ్లీ ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో…విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి సూపర్ డూపర్ హిట్టర్లున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 20 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోరు సాధించి…ప్రత్యర్థి ఎదుట 205 పరుగుల లక్ష్యం ఉంచినా పరాజయం తప్పలేదు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం […]
- రాయల్ చాలెంజర్స్ వరుసగా ఐదో ఓటమి
- 205 పరుగుల భారీస్కోరు సాధించినా తప్పని పరాజయం
- బౌలర్ల చెత్తప్రదర్శన క్షమార్హం కాదన్న కొహ్లీ
ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో…విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి సూపర్ డూపర్ హిట్టర్లున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
20 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోరు సాధించి…ప్రత్యర్థి ఎదుట 205 పరుగుల లక్ష్యం ఉంచినా పరాజయం తప్పలేదు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఐదోరౌండ్ పోటీలో… రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన హైస్కోరింగ్ సమరంలో సైతం బెంగళూరుకు షాక్ తప్పలేదు.
కొహ్లీ 8 వేల పరుగుల రికార్డు….
ఈ కీలకమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు కు కొహ్లీ-డివిలియర్స్ 108 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే స్కోరు అందించారు. ఈ క్రమంలోనే విరాట్ కొహ్లీ…. టీ-20 ఫార్మాట్లో 8వేల పరుగుల మైలురాయిని చేరిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
కొహ్లీ- డివిలియర్స్ జోడీ పరుగుల మోత మోగించి… ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యం ఉంచినా… బౌలర్ల వైఫల్యంతో కంగుతినక తప్పలేదు.
రస్సెల్ రచ్చరచ్చ….
కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ హిట్టర్ యాండ్రీ రస్సెల్ కేవలం 13 బాల్స్ లోనే సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి 48 పరుగులతో నాటౌట్ గా నిలవడం ద్వారా తనజట్టుకు మరో సంచలన విజయం అందించాడు.
కొహ్లీ లబోదిబో…
ఈ కీలకమ్యాచ్ లో తమజట్టు ఓటమికి…. బౌలర్ల వైఫల్యమే కారణమని…మ్యాచ్ అనంతరం కొహ్లీ వాపోయాడు. రస్సెల్ ను నిలువరించడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని…తెలివిగా ఏమాత్రం బౌల్ చేయలేకపోయారని చెప్పాడు.
ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. చివరి నాలుగు ఓవర్లలోనే కథ అడ్డం తిరిగింది. మ్యాచ్ గెలవడానికి కీలకంగా భావించే డెత్ ఓవర్లలో బౌలర్లు గతి తప్పారు.
ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. మా బౌలర్లు పరిస్థితికి తగ్గట్టుగా బౌల్ చేసి ఉండాల్సిందని అన్నాడు.
ఈ సీజన్‌లో మా జట్టు ఆటతీరు ఏమంత గొప్పగాలేదని నాకు తెలుసు. కీలక సమయాల్లో ధైర్యంగా బౌలింగ్ చేస్తే ఎలాంటి జట్టుకైనా విజయం తథ్యం. రసెల్ లాంటి పవర్ హిట్టర్లను ఎదుర్కోవాలంటే తెలివిగా బౌల్ చేయటాన్ని మించిన వ్యూహం మరొకటిలేదు.
ఈ సీజన్లో మేం నిరుత్సాహపరిచే ఉండొచ్చు.. కానీ పుంజుకోవడానికి ఇంకా మాకు అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటమే ప్రధానం అంటూ కొహ్లీ ధైర్యవచనాలు పలికాడు.
ఏదిఏమైనా… గొప్పగొప్ప ఆటగాళ్లున్నంత మాత్రాన టీ-20 క్రికెట్లో విజయాలు సాధించలేమని, విజయవంతమైన జట్టుగా నిలువలేమనటానికి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస పరాజయాలే నిదర్శనం.