మరో బ్రీఫ్డ్ టేపు విడుదల
చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయి నుంచి గల్లీ స్థాయి లీడర్‌గా దిగజారిపోయారు. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన చంద్రబాబు… పార్టీల వారీగా ట్రీట్ చేస్తున్నారు. కుప్పం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… వారికి చేసిన సూచనలు చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. కుప్పంలో పరిస్థితిపై నేతలతో మాట్లాడిన చంద్రబాబు… ఐదేళ్లలో ఎవరైనా టీడీపీ వల్ల ఇబ్బంది పడి ఉంటే ఎన్నికల సమయంలో ఈగో వదిలేసి వారికి క్షమాపణ చెప్పి దారికి తెచ్చుకోవాలని సూచించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే జగన్ మీటింగ్‌కు ఎవరూ వెళ్లడానికి వీల్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలా […]
చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయి నుంచి గల్లీ స్థాయి లీడర్‌గా దిగజారిపోయారు. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన చంద్రబాబు… పార్టీల వారీగా ట్రీట్ చేస్తున్నారు.
కుప్పం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… వారికి చేసిన సూచనలు చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. కుప్పంలో పరిస్థితిపై నేతలతో మాట్లాడిన చంద్రబాబు… ఐదేళ్లలో ఎవరైనా టీడీపీ వల్ల ఇబ్బంది పడి ఉంటే ఎన్నికల సమయంలో ఈగో వదిలేసి వారికి క్షమాపణ చెప్పి దారికి తెచ్చుకోవాలని సూచించారు.
అంతవరకు బాగానే ఉంది. అయితే జగన్ మీటింగ్‌కు ఎవరూ వెళ్లడానికి వీల్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలా వెళ్లిన వారి వివరాలు నోట్ చేసుకోవాలని స్థానిక నేతలకు సూచించారు. మళ్లీ వచ్చాక వారికి ఏం చేయాలన్నది చేద్దాం. నార్మల్‌గా ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అందకుండా చేస్తే సరిపోతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి… ఇలా ఒక పార్టీ మీటింగ్‌కు వెళ్లిన వారికి పథకాలు అందకుండా చేద్దామని గల్లీ నేతలతో మాట్లాడడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వైపరిత్యానికి నిదర్శనంగా భావించవచ్చు.